2021 సంవత్సరం ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి భీమా కంపెనీలు సాధారణ పెన్షన్ స్కీమ్ ను అమలు చేయనున్నాయి. జనవరి నెల 25వ తేదీన భీమా కంపెనీలకు భీమా రెగ్యులేటర్ ఐఆర్‌డిఎఐ ఈ స్కీమ్ ను అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పాలసీదారులు సాధారణ పెన్షన్ స్కీమ్ లో రెండు రకాల యాన్యుటీ ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వేతర ఉద్యోగులకు సాధారణ పెన్షన్ స్కీమ్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.
Also Read: ఏప్రిల్ నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు తగ్గనున్న జీతాలు.. కానీ..?
సాధారణన్ పెన్షన్ స్కీమ్ ను తీసుకున్న కస్టమర్లు ఈ పాలసీని తీసుకున్న తరువాత ఒకేసారి మొత్తం పెన్షన్ ను చెల్లించాల్సి ఉంటుంది. మొదటి పెన్షన్ ఆప్షన్ లో పాలసీదారుడు జీవించి ఉన్నంత కాలం పెన్షన్ ను పొందే అవకాశం ఉంటుంది. పాలసీదారు అభ్యర్థి ఈ స్కీమ్ ద్వారా బేస్ ప్రీమియంను పొందే ఛాన్స్ ఉంటుంది. రెండవ ఆప్షన్ లో లైఫ్ లాంగ్ పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. ఈ ఆప్షన్ లో భార్యాభర్తలిద్దరూ పెన్షన్ కు అర్హులే.
Also Read: ఎస్బీఐ కస్టమర్లకు బంపర్ ఆఫర్.. డబ్బులు లేకున్నా విత్ డ్రా..?
హోల్డర్లు ఇద్దరూ ఒకే మొత్తంలో పెన్షన్ పొందవచ్చు. 40 సంవత్సరాల వయస్సు పైబడిన స్త్రీపురుషులు సాధారణ పెన్షన్ స్కీమ్ ను తీసుకోవడానికి అర్హులు. పెట్టుబడి మొత్తాన్ని బట్టి కనీస పెన్షన్ ను నిర్ణయించడం జరుగుతుంది. తీవ్రమైన అనారోగ్యం ఉంటే సాధారణ పెన్షన్ స్కీమ్ లో డిపాజిట్ చేసిన మొత్తాన్ని వెనక్కు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ లో లోన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
స్కీమ్ లో చేరిన 6 నెలల తర్వాత లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 1 నుంచి ఈ స్కీమ్ అమలులోకి రానుండగా ఈ స్కీమ్ కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.