https://oktelugu.com/

జనసేనకు మద్దతుగా ‘చిరు’ ఉక్కు వ్యూహం?

విశాఖ ఉక్కు పరిశ్రమ సమస్యపై ప్రత్యక్షంగా పోరాడే నాయకుల కన్నా.. పరోక్షంగా మద్దతు తెలుపుతున్నామనేవారు ఎక్కువైపోయారు. విశాఖ స్టీల్ ప్లాంటు ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ.. ట్విట్టర్ వేదికగా.. మద్దతు ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవిపై ప్రధానంగా ప్రతిక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ప్రయిటేటీకరణకు కారణమైన బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న జనసేనాని పవన్ కల్యాణ్ రాజకీయంగా నష్టపోకుండా చిరంజీవి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా చిరంజీవి తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేశారు. పార్టీలకు […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 11, 2021 / 01:29 PM IST
    Follow us on


    విశాఖ ఉక్కు పరిశ్రమ సమస్యపై ప్రత్యక్షంగా పోరాడే నాయకుల కన్నా.. పరోక్షంగా మద్దతు తెలుపుతున్నామనేవారు ఎక్కువైపోయారు. విశాఖ స్టీల్ ప్లాంటు ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ.. ట్విట్టర్ వేదికగా.. మద్దతు ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవిపై ప్రధానంగా ప్రతిక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ప్రయిటేటీకరణకు కారణమైన బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న జనసేనాని పవన్ కల్యాణ్ రాజకీయంగా నష్టపోకుండా చిరంజీవి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా చిరంజీవి తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేశారు. పార్టీలకు అతీతంగా కదలిరావాలని పిలుపునివ్వడంతో చిరంజీవి ఉద్యమంలో పాల్గొంటారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

    Also Read: మమతాపై దాడి.. వేడెక్కిన బెంగాల్ రాజకీయం

    జగన్ ప్రభుత్వం అభివృద్ధిక వీకేంద్రికరణ కారణంగా చేపట్టిన మూడు రాజధానుల ప్రకటనకు గతంలో చిరంజీవి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో చిరంజీవిని ఓ వర్గం మీడియా.. ప్రధాన ప్రతిక్షం టార్గెట్ చేసింది. రాజధాని ఉద్యమానికి మద్దతు ఇవ్వని చిరంజీవి… నేడు ఉక్కు పోరాటానికి మద్దతుగా చేసిన ట్విట్ కు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం వెనుక రాజకీయ కుట్ర ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియామకం అయిన కొత్తలో ఆయన చిరంజీవిని కలిసి మద్దతు కోరారు. చిరంజీవిని కలవడం ద్వారా కాపులందరినీ ఐక్యం చేయాలని ఎజెండాతో సోము అడుగులు వేస్తున్నారనే ప్రచారం జరిగింది.

    ఇటీవల జనసేన కీలకనేత నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. చిరు మద్దతు తమకు ఉందని తెలిపారు. అవసరమైన సమయంలో ఆయన జనసేనకు అండగా నలుస్తారని తెలిపారు. ఇటీవల సోము వీర్రాజు కూడా తమ కూటమికి చిరంజీవి మద్దతు ఇస్తారని ప్రకటించారు. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు ప్రయివేటికరణపై ఏపీ ప్రజలు భగ్గు మంటున్నారు. దీంతో బీజేపీతో పాటు దాని మిత్రపక్షం జనసేన ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఏం చేయాలో ఆ రెండు పార్టీలకు తెలియడం లేదు. ఉక్కు ఉద్యమానికి చిరు మద్దతు ప్రకటించడం వెనక తమ్ముడు పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ నేతల వ్యూహం ఉందని.. అన్ని రాజకీయ పక్షాలు అంతర్గత చర్చల్లో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.

    Also Read: ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే.. చెల్లించక తప్పదు భారీ మూల్యం

    చిరు ప్రత్యక్ష పోరుతో తమ్ముడికి రానున్న రోజుల్లో లాభం చేకూర్చవచ్చనే ఎత్తుగడ ఉందంటున్నారు. ఎందుకంటే.. బీజేపీతో పొత్తు కారణంగా పవన్ కల్యాణ్ ఏమీ చేయలేని నిస్సహాక స్థితిలో ఉన్నారు. తమ్మడి ఇబ్బందిని గమనించిన చిరంజీవి.. తెలివిగా ఉక్కు ప్రయివేటీకరణపై తన వ్యతిరేకతను వ్యక్తం చేశారు. రాజకీయాలు.. ప్రాంతాలకు అతీతంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం చిరు స్పందనపై చాలా రకాలు కామెంట్లు వినిపిస్తున్నాయి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్