https://oktelugu.com/

మమతాపై దాడి.. వేడెక్కిన బెంగాల్ రాజకీయం

ఒక ముఖ్యమంత్రికి మూడంచెల భద్రత ఉంటుంది. అందరినీ దాటుకుని రావడం చాలా కష్టమైన పని.. ముఖ్యమంత్రికి అర్జీ ఇవ్వాలంటేనే.. సెక్యూరిటీ వాళ్లు లాగి అవతలికి పడేస్తుంటారు. అలాంటిది ఒక ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చి వారిని గాయపరిచేంతగా ధైర్యం చేశారంటే.. ఆ సమయంలో పోలీసులు, సెక్యూరిటీ వ్యవస్థ ఏమరపాటుగా ఉన్నారంటే.. అసలు ఆ దాడి చేసిన వాళ్లు క్షణాల్లో కనిపించకుండా మాయం అయ్యారంటే.. ఇంకేమైనా ఉందా..? సినిమాల్లో తరుచుగా జరిగే ఇలాంటి లాజికల్ సన్నీవేశాలు ఇప్పుడు పశ్చిమ బెంగాల్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 11, 2021 / 01:19 PM IST
    Follow us on


    ఒక ముఖ్యమంత్రికి మూడంచెల భద్రత ఉంటుంది. అందరినీ దాటుకుని రావడం చాలా కష్టమైన పని.. ముఖ్యమంత్రికి అర్జీ ఇవ్వాలంటేనే.. సెక్యూరిటీ వాళ్లు లాగి అవతలికి పడేస్తుంటారు. అలాంటిది ఒక ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చి వారిని గాయపరిచేంతగా ధైర్యం చేశారంటే.. ఆ సమయంలో పోలీసులు, సెక్యూరిటీ వ్యవస్థ ఏమరపాటుగా ఉన్నారంటే.. అసలు ఆ దాడి చేసిన వాళ్లు క్షణాల్లో కనిపించకుండా మాయం అయ్యారంటే.. ఇంకేమైనా ఉందా..? సినిమాల్లో తరుచుగా జరిగే ఇలాంటి లాజికల్ సన్నీవేశాలు ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లో జరిగాయి.

    Also Read: పట్టుదల.. మొండి పట్టుదల ఎవరిది గెలుపు?

    నందిగ్రామ్ లో నామినేషన్ వేసి తిరుగుపయమైన ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. కారు డోరు తోసేయడంతో ఆమె కాలికి గాయం అయ్యింది. ఆ వెంటనే దీదీని టైట్ సెక్యూరిటీ మధ్య కోల్ కత్తాలోని ఓ ఆస్పత్రికి తరలించి చికత్స అందించారు. అయితే ఈ సమాచారం అంతా స్వయంగానే మమతానే మీడియాకు అందించడం , సోషల్ మీడియాలో పంచుకోవడం విశేషం. దెబ్బతగిలిని మమత, తన కాలుపట్టుకుని అల్లాడిపోతూ.. కనిపించిన ఫొటో ఇప్పుడు ఫోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

    Also Read: వ్యతిరేక పవనాలు.. జమిలీ ఎన్నికలకు మోడీ బ్రేక్

    తనపై దడి జరగడానికి బీజేపీనే కారణంగా అంటూ.. పశ్చిమ బెంగాల్ డీజీపీని మార్చిన మరుసటిరోజే తనపై దాడి జరిగిందని, దీని వెనక పెద్ద కుట్రనే ఉందని మమత ఆరోపిస్తున్నారు. అయితే కుట్రకన్నా.. ఎక్కువగా పెద్ద డ్రామాని రక్తి కట్టించారని బీజేపీ నేతలు విమర్శలకు దిగుతున్నారు. ముఖ్యమంత్రిపై దాడిచేయడం ఎవరికి సాధ్యమని.. చిన్న విషయాన్ని పెద్దగా చేసి చూపుతూ…. మమతా సింపతికోసం ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. నందిగ్రామ్ లో ఓటమి తప్పదని నామినేషన్ వేసిన రోజే మమతకు అర్థమైందని అందుకే పోతూ..పోతూ.. ఆమె ఇలాంటి సింపతీ డ్రామాలు మొదలు పెట్టారని బీజేపీ నేతలు చెబుతున్నారు.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

    పశ్చిమ బెంగాల్ ఎన్నికలను అటు దీదీ.. ఇటు షా.. మోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. లోక్ సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు రిపీట్ అవుతాయనే ఆశలో ఉన్న బీజేపీ.. బెంగాల్ పై బాగా ఫోకస్ చేసింది. అమిత్ షా ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర పర్యటనకు వెళ్లారు. ఇటీవలే మోదీ కూడా కోల్ కతాకు వచ్చి సై అన్నారు. టీఎంసీని బలహీనపరిచేందుకు వలసలకు గేట్లు ఎత్తేశారు. ఈ పాటికే కీలక నేతలందరినీ తనవైపు తిప్పుకున్నారు. ఇలా వ్యూహాత్మకంగా వెళ్తున్న బీజేపీకి.. ఇప్పుడు దాడి వ్యవహారంతో బ్రేక్ వేయాలని చూస్తున్నారు మమతా బెనర్జీ. బీజేపీ రౌడీ రాజకీయాలను అడ్డుకోవాలని కార్యక్తలకు పిలుపునిస్తోంది.