Pawan Kalyan : ఆంధ్రాలో కులగణన అయిపోయింది. ఇంటికెళ్లి సేకరించే ప్రక్రియ ముగిసింది. మిగిలిపోయిన వారితో సెకండ్ ఫేజ్ లో ఫిబ్రవరి 2లోపు వార్డు సచివాలయానికి వచ్చి నమోదు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 15 వరకూ లిస్ట్ ఫైనలైజ్ కానుంది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి చేరాలి. ఏపీ ప్రభుత్వం ఎప్పుడు పబ్లిష్ చేస్తుందన్నది సందేహంగా ఉంది.
ఎన్నికలు వస్తాయని తెలిసి కూడా కుల గణనను వైసీపీ ప్రభుత్వం ఎందుకు చేసిందన్నది అందరికీ అనుమానాలున్నాయి. నచ్చినా.. నచ్చకపోయినా కులం అనేది రియాలిటీ. రిజర్వేషన్లు ఎవరికైతే కావాలో నిజమైన గణాంకాలు అవసరం. ఇది సంఖ్యా పరంగా ఉన్న వారికి కుల గణన ఎంతో ఉపయోగపడుతుంది.
కులగణనను ఎన్నికల వేళ ఈ పద్ధతిలో జగన్ సర్కార్ చేయడాన్ని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కులగణనపై ఎందుకు అభ్యంతరం తెలుపుతున్నాడు. అసలు ఇందులో ఏముంది అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.