pawan kalyan yatra for farmers : జనసేనాని జనంలోకి వస్తున్నారు. రైతుల కోసం కదిలి వస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కోసం పరామర్శకు బయలు దేరారు. ఆంధ్రప్రదేశ్ లో రైతుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు పవన్ కళ్యాణ్ నడుం బిగించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల కోసం పరామర్శ యాత్ర చేపట్టాలని నిర్ణయించారు.

ఆంధ్రప్రదేశ్ లో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థిక సహాయం చేసే గొప్ప క్రతువును పవన్ కళ్యాన్ చేపట్టారు. పోరాటాలే కాకుండా వారి దీనగాథను ప్రభుత్వానికి, ప్రజలకు తెలుపాలని డిసైడ్ అయ్యారు.
ఇటీవల రైతు సమస్యల గురించి పవన్ కళ్యాణ్ జనసేన శ్రేణులు తీసుకెళ్లారు. పార్టీ నాయకత్వం దీనిపై పవన్ కు సూచించింది. పంట నష్టాలతో రైతులు, కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమని జనసేన అధినేత పవన్ అభిప్రాయపడ్డారు. జనసేన పార్టీ శ్రేణులు సేకరించిన సమాచారం మేరకు గోదావరి జిల్లాల్లోనే ఏకంగా 73మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసి పవన్ కరిగిపోయారు. వారందరినీ ఆదుకోవాలని నిర్ణయించారు.
సాగును నమ్ముకున్న రైతుల పరిస్థితి దీనంగా ఉందని.. కొంతైనా ఊరట కలిగేలా వారికి జనసేన పక్షాన ఆర్థిక సాయం అందించాలని పవన్ నిర్ణయించారు. ఒక్కో కుటుంబానికి రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించారు. ఈ సాయంతో రైతు కుటుంబాల్లోని పిల్లల చదువులకు కొంతైనా అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నారు.
త్వరలోనే ప్రతీ రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ బయలుదేరుతున్నారు. ఈ రైతులకు ప్రభుత్వం కూడా ఆదుకోవాలని.. వారికి ఇప్పటివరకూ రూపాయి కూడా ప్రభుత్వ సాయం అందలేదని పవన్ పేర్కొన్నారు. పవన్ పర్యటనతోనైనా రైతులకు మరింత సాయం అందాలని ఆశిద్ధాం.
[…] Ugadi 2022: తెలుగు సంవత్సరాదిగా ఉగాదిని జరుపుకుంటాం. పంచాంగ శ్రవణం ప్రధానంగా చేస్తుంటాం. మేషాది ద్వాదశ రాశుల ఫలితాలు తెలుసుకుని తమ జీవితంలో భవిష్యత్ ఎలా ఉండబోతోందని అందరు ఆసక్తి చూపిస్తుంటారు. గతంలో కంటే భిన్నంగా ఉండాలని ఆకాంక్షిస్తుంటారు. తమ రాశుల ప్రభావాన్ని తెలుసుకుని మురిసిపోతుంటారు. శుభకృత్ సంవత్సరంలో అందరికి శుభాలు కలగాలని ఆకాంక్షిస్తాం. శని మకరంలో కంటే కుంభంలో సంచరించే సమయంలో బాగా అనుకూలిస్తాడని చెబుతున్నారు. […]
[…] Also Read:pawan kalyan yatra for farmers : జనంలోకి జనసేనాని: రైతు ఓద… […]
[…] Pawan Future CM RRR Writer Crazy Comments: టాలీవుడ్ లో ఏ హీరోకి లేని క్రేజ్ ఒక్క పవన్ కళ్యాణ్ కి మాత్రమే ఉంది. ఏ హీరోకి లేని భక్తులు ఒక్క పవన్ కళ్యాణ్ కి మాత్రమే ఉన్నారు. అందుకే.. పవన్ కళ్యాణ్ అంటే పవర్ కి ప్రతిరూపం. తాజాగా నేషనల్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ పవన్ పై క్రేజీ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ – రాజమౌళి కాంబినేషన్ గురించి మాట్లాడుతూ.. ‘భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశం మాకు రాకపోవచ్చు. అప్పటి లోపు ఆయన సీఎం కూడా అయిపోవచ్చు’ అంటూ క్రేజీ కామెంట్స్ చేశారు. […]
[…] AP Cabinet Expansion: ఏపీలో కొత్త మంత్రివర్గం కూర్పు దాదాపుగా ఖాయమయ్యిందా? ఈసారి వచ్చేది ఎన్నికల క్యాబినేటా? ఇటీవల దూరమైన కొన్ని సామాజికవర్గాలను మచ్చిక చేసే ప్రయత్నం చేస్తున్నారా? అందుకు అనుగుణంగా మంత్రివర్గ కూర్పు జరుగుతుందా? అంటే.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామక్రిష్టారెడ్డి వ్యాఖ్యలు అవుననే సమాధానం చెబుతున్నాయి. […]
[…] Pawan Kalyan Farmers: ఏదో సమావేశంలో అరగంట పాటు ఆయన ప్రసంగిస్తేనే రాజకీయాలు హీటెక్కిపోతాయి. అటువంటిది రోజుల వ్యవధి ప్రజల మధ్య, వారి సమస్యలపైనే మాటాడితే దిమ్మతిరిగిపొద్ది కదూ.. మైండ్ బ్లాక్ అయిపోతుంది కదూ..అదేనండి జనసేనాని పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో రైతు ఓదార్పు యాత్ర చేపడుతున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. అధికార వైసీపీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నువ్వు రెండుచోట్ల ఓడిపోయావు. నీకు రాజకీయ పరిణితి లేదు. చంద్రబాబుకు బినామీ అంటూ అధికార పార్టీ మంత్రుల నుంచి కింది స్థాయి ఎమ్మెల్యేల వరకూ రకరకాల వ్యాఖ్యానాలు పవన్ చేస్తుంటారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పవన్ మీటింగులంటే ప్రభుత్వ పెద్దలకు కంగారే. ఆయన ఏం మాట్లాడుతారు? ఎవర్ని కడిగి పారేస్తారోనన్న భయం వారిని వెంటాడుతుంటుంది. రాష్ట్రంలో సాగు గిట్టుబాటుకాక.. ప్రభుత్వ ప్రోత్సాహం లేక ఆత్మహత్యలు చేసుకున్న రైతులను ఓదార్చేందుకు పవన్ సిద్ధమవుతున్నారు. ఈ యాత్రకు సంబంధించి సన్నాహాలు శర వేగంగా జరుగుతున్నాయి. […]
[…] Ramoji Rao- Megastar Chiranjeevi: అవి మెగాస్టార్ చిరంజీవి ‘స్టేట్‌రౌడీ’ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్న రోజులు. చెన్నైలో ఈ సినిమా ఓపెనింగ్ అట్టహాసంగా చేశారు. ఈ వేడుకకు అప్పటి తెలుగు తమిళ సినీ అతిరథ మహారథులంతా వచ్చారు. పైగా అప్పట్లో విచిత్రంగా భావించిన మరో అంశం ఈ సినిమా ఓపెనింగ్ కి అప్పటి రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా రావడం. […]