UP Woman: ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని అంటుంటారు. కానీ ఆ ఐడియానే ఇప్పుడు వందలమందిని కాపాడింది. వారికి కొత్త బతుకును ఇచ్చింది. ఇదంతా ఓ మహిళ బుర్రకు సమయానుసారం తట్టిన ఆలోచన.. ఆమె చూపిన ధైర్యానికి ఇప్పుడు ఒక పెద్ద రైలు ప్రమాదం తప్పింది. వందల మంది ప్రాణాలతో బతికి బయటపడ్డారు.ఆ మహిళ చేసిన పనికి ఇప్పుడు ప్రశంసలు కురుస్తున్నాయి.

ఉత్తరప్రదేశ్ లో రైలు ప్రమాదం తృటిలో తప్పింది. ఓ మహిళ చాకచక్యంగా వ్యవహరించి ఎంతో మంది ప్రాణాలను కాపాడింది. రైలు పట్టా విరిగిపోవడాన్ని గమనించిన మహిళ వెంటనే బుర్రకు పదును పెట్టింది. వేలాది మందిని కాపాడింది.
రైలు పట్టా విరిగిపోవడాన్ని గమించిన మహిళ వెంటనే తన ఒంటిపై ఉన్న ఎర్ర చీరను ఎగురవేసి వస్తున్న రైలును ఆపింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఇటాహ్ జిల్లా కేంద్రానికి 20 కి.మీల దూరంలో ఉన్న కుస్సా రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది.
ఇటాహ్ జిల్లా అవఘర్ బ్లాక్ లోని గులేరియా గ్రామానికి చెందిన ఓంవతి అనే 65 ఏళ్ల మహిళ పొలం పనులకు వెళుతుండగా.. రైల్వే ట్రాక్ విరిగిపోవడాన్ని గుర్తించింది. ఇంతలో అటు నుంచి రైలు వస్తుండడం గమనించింది. వెంటనే రైలు డ్రైవర్ ను అప్రమత్తం చేయడానికి ప్రయత్నించింది. జెండా ఎగురవేయడానికి తన దగ్గర ఏమీ లేకపోవడంతో వెంటనే తన ఎర్ర చీరను విప్పి గాల్లో ఊపించింది. ట్రాక్ కు అడ్డంగా కర్రల సాయంతో చీరలను అడ్డంగా పాతింది. రైలు డ్రైవర్ ప్రమాదాన్ని గుర్తించేలా చెట్టు కొమ్మలను ఉపయోగించి ఎర్రచీరను ట్రాక్ పై అడ్డంగా వేలాడదీసింది.

అప్పుడే ఇటాహ్ నుంచి తుండ్ల వెళ్లే ఓ ప్యాసింజర్ రైలు వందల మంది ప్రయాణికులతో వస్తోంది. అందులోని రైలు డ్రైవర్ ట్రాక్ పై ఎరుపు రంగు చీర ను గుర్తించి సమయానికి బ్రేకులు వేశాడు. రైల్వే ట్రాక్ దెబ్బతినట్టు గుర్తించారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన ఆ మహిళ ఐడియాకు ట్రైన్ డ్రైవర్ మెచ్చుకున్నాడు. ఆమెకు నగదు బహుమతి ఇచ్చాడు.
డ్రైవర్ ను అప్రమత్తం చేయడానికి వెంటనే తన చీరను జెండాల ఊపి ప్రాణాలు కాపాడిన మహిళ సాహసానికి ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.
श्रीमती ओमवती।
सुबह खेत पर काम करने जा रही थीं।
ट्रैक पार करते समय अचानक टूटी पटरी पर नजर पड़ गई।
ट्रेन आने वाली थी, इन्होंने समझदारी दिखाते हुए अपनी लाल रंग की साड़ी को लकड़ियों की मदद से ट्रैक पर खड़ा कर दिया।ट्रेन रोकी गई, पटरी ठीक हुई तब 30 मिनट बाद ट्रेन रवाना हुई।👏 pic.twitter.com/j4SJPTN3kl
— SACHIN KAUSHIK (@upcopsachin) March 31, 2022