Pawan Kalyan: విశాఖలో తన జనవాణి కార్యక్రమాన్ని భగ్నం చేసి.. జనసేన కీలక నేతలందరినీ అరెస్ట్ చేసిన వైసీపీ సర్కార్ పై, పోలీసులపై జనసేనాని పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు.వారి అక్రమాలకు ప్రజలు చరమగీతం పాడే రోజు దగ్గరలోనే వస్తుందని హెచ్చరించారు. తమను ఇంతలా వేధిస్తున్న వైసీపీ సర్కార్ కు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు.

మాట మాట్లాడితే తాను మూడు పెళ్లి చేసుకున్నానని అంటున్నారని.. మీడియా కూడా అదే కూస్తోందని దానిపై పవన్ కళ్యాణ్ సంచలన కౌంటర్లు ఇచ్చారు. ‘నాకు సెట్ కాలేదు. కుదరలేదు. అందుకే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాను. మీరు చేసుకోండయ్యా పెళ్లిళ్లు.. వీలు కాకపోతే వైసీపీ నేతలూ.. ఊరికే ఎందుకు వాగుతారు.. సమస్యలపై మాట్లాడమంటే నా మూడు పెళ్లిళ్ల గురించి తీస్తారా?’ అంటూ మండిపడ్డారు.
‘మూడు సార్లు పెళ్లిళ్లు చేసుకున్నా.. మూడు చోట్ల రాజధానులు పెట్టమంటారా? చాలా అసూయ పడుతానయ్యా తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్నందుకు.. నాకు కుదరలేదయ్యా బాబూ.. పిచ్చి లాజిక్ లు.. సంబంధంలేని లాజిక్ లు మాట్లాడవద్దు’ అంటూ పవన్ కళ్యాణ్ తన మూడు పెళ్లిళ్లపై వస్తున్న విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు..
గొడవ కావాలనే .. కొట్టుకుచావాలనే వైసీపీ సర్కార్ చూసిందని.. అందుకే తాను సంయమనం పాటించానని పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ గుండాగిరీ, కుట్రలను సాగనివ్వమని స్పష్టం చేశారు. పోలీసులు తనను చంపేస్తారంటూ కనీసం చేయి ఊపనివ్వకుండా అడ్డుకున్నారని.. నన్ను చంపుతారనే వదంతలు బాధ కలిగించాయని.. చావుకు భయపడే వాడిని కాదన్నారు.
ఇక అరెస్ట్ చేసిన జనసేన నేతలను వదిలిపెట్టే వరకూ తమ పోరాటం కొనసాగుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. న్యాయపోరాటం చేస్తామన్నారు. ఇక జనసేన జనవాణి నేతల అరెస్ట్ తో రద్దు చేసినట్టు తెలిపారు.