Salar Prithviraj First look :రాధేశ్యామ్ తరువాత ప్రభాస్ నటిస్తున్న భారీ యాక్షన్ బడ్జెట్ చిత్రం సలార్. హోంబలే ఫిల్మ్ పతాకంపై వస్తున్న ఈ మూవీకి ప్రశాంత్ నీల్ డైరెక్టర్. కొన్ని రోజుల నుంచి శరవేగంగా సాగుతున్న ఈ సినిమా నుంచి ఆదివారం సర్ ఫ్రైజ్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమార్ నెగెటివ్ రోల్ లో నటిస్తున్నారు. మలయాళంలో స్టార్ హీరో అయిన పృథ్వీ సలార్ లో విలన్ గా నటించడం అందరికీ ఆశ్చర్యం కలిగించిన విషయమే. అయితే ఈరోజు ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

ఇందులో పృథ్వీరాజ్ సుకుమార్ భయంకరంగా కనిపిస్తున్నాడు. దీనిని భట్టి సలార్ లో పృథ్వీ క్రూరమైన విలన్ గా నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మసిపూసిన మొహంతో ఉన్న ఆయన ముక్కుకి పుడక, మెడలో వెండి కడియాలు కనిపిస్తున్నాయి. అలాగే ముహంపై గాట్లు, కళ్లల్లో కోపం చూస్తే భయంకర విలన్ అని అర్థమవుతుంది. ఇక పొడవైన బొట్టు, చెవికి రింగులు కూడా ఉండడంతో మంచి మాస్ కలిసిన పాత్రే ఉండి ఉంటుందని అనుకుంటున్నారు. ఇందులో జగపతిబాబు కూడా విలన్ పాత్రలో పోషించినా పృథ్వీరాజు సుకుమారే మెయిన్ విలన్ అని తెలుస్తోంది.
ప్రభాస్ నటించిన ఏ సినిమాలోనైనా ఆయనకు తగిన విధంగా భారీ కాయంతో కూడిన విలన్లను సెట్ చేస్తారు. ఛత్రపతి నుంచి సాహో వరకు ప్రభాస్ సినిమాలలో అందరూ భయంకరంగా ఉన్న విలన్లే ఇప్పడు సలార్ లో కూడా అదే ప్రయత్నం చేశారు. అయితే స్టార్ హీరో పాత్రలో పోషించిన పృథ్వీ విలన్ గా కూడా ఆకట్టుకుంటాడని అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే ఆయన గెటప్ చూస్తేనే సినిమా రేంజ్ ఏంటో అర్థమవుతుందని చర్చించుకుంటున్నారు.
బొగ్గుగనుల నేపథ్యంలో వస్తున్న ఈసినిమా విశేషాలు ఇప్పటికే బయటకు వచ్చాయి. ఉత్తర తెలంగాణలోని రామగుండంలో ఈ సినిమాను చిత్రీకరించారు. అప్పుడు ప్రభాస్ కూడా మసి పూసిన మోహంతోనే కనిపించారు. అంటే సినిమాలో ఉన్నవారంతా ఇలాగే కనిపిస్తారని అర్థమవుతోంది. దీంతో ఈ సినిమాపై మరింత హోప్స్ పెరిగాయి. ఇప్పటికే కేజీఎప్ సినిమాలో మంచి ఊపుమీదున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమాను కూడా అదే రేంజ్ తో తీర్చిదిద్దుతున్నారని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.
ఇక ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా శృతిహాసన్ నటిస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ కంటిన్యూ అవుతున్నా వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఔట్ డోర్ షూటింగ్ పూర్తయిన తరువాత ప్రొడక్షన్ వర్క్ కోసం కూడా టైం తీసుకోనున్నారు. ప్రభాస్ ఇందులో కార్మిక నాయకుడిగా అలరించనున్నాడు. ఆయన షూటింగ్ కు సంబంధించిన కొన్ని సీన్స్ గతంలోనే లీకయ్యాయి. తాజాగా రిలీజ్ చేసిన పృథ్వీ లుక్ ప్రభాస్ ఫ్యాన్స్ మరింత సర్ ఫ్రైజ్ అవుతున్నారు.