Hyderabad Rains : ప్రకృతికి పైసలున్నోడు.. పైసలు లేనోడు అన్న తేడా లేదు.. జూబ్లీహిల్స్ లో బడాబాబులు ఉన్నారని వానలు ఎక్కువ పడవు.. కరువు పీడిత మహబూబ్ నగర్ లో పేదలు ఉన్నారని తక్కువ పడవు. అందరినీ ఒకేలా చూస్తుంది.. అన్నింటిని సమానంగా ఇచ్చేస్తుంది.
కానీ మనమే విభజించుకుంటున్నాం.. అది ఖరీదైన భూమి అని కోట్లు పోసి కొంటున్నాం.. కానీ వానలు, కాలువలకు ఆ విషయం తెలియదు కదా.. అందుకే కోట్లు పెట్టిన కొన్న భూములను కూడా ముంచేస్తున్నాయి. ఎకరం రెండు వందల కోట్ల విలువైన భూములు ఉన్న హైదరాబాద్ నగరంలోని నానక్ రామ్ గూడ కూడా ఇందుకు మినహాయింపు కాదు..
ఎకరం 200 కోట్ల విలువ చేసే నగరంలోనే ఖరీదైన నానక్ రామ్ గూడలో గంట వాన వస్తే చాలు గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతుంది. వర్షంతో అక్కడి వాసుల బాధలు చెప్పనలవి కాదు.. వర్షంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీళ్లు వస్తే ఎక్కడికి పోతాయో తెలియడం లేదు. నానక్ రామ్ గూడ మొత్తం మునిగిపోతోంది.
నానక్ రామ్ గూడ అంటే కొత్తగా అభివృద్ది చెందిన ఖరీదైన ప్రాంతం. ఇక నూతన అధునాతన నిర్మాణాలు సాగుతున్నాయి. ఇక్కడ నిర్మించబోయే రోడ్లు కదా ఇక్కడ కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. గట్టిగా గంట వర్షం పడితే ఎక్కడికి అక్కడ ఆగిపోతున్నాయి. నడుం లోతు నీళ్లతో ఇళ్లు, వాహనాలు, రహదారులు మునిగిపోతున్నాయి.
దీంతో సగటు నానాక్ రామ్ గూడ వాసి ఇన్ని కోట్లు పెట్టి కొన్న ఇక్కడ కూడా ఇంత అధమ వసతులు ఏంటి అని మనోవేదనకు గురి అవుతున్నారు. ఇక్కడే ఇలా ఉంటే ఇక స్లమ్, కాలువలు, చెరువుల ఏరియాలు ఏంటని నిలదీస్తున్నారు.