Media Pawan kalyan: ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు అపర భీకరంగా సీఎం జగన్ ఉన్నారు. ఆయనను కొట్టే నేత కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబుకు వయసైపోవడం.. ఆయన వారసుడు లోకేష్ కు అంత శక్తి సామర్థ్యాలు లేకపోవడంతో ఏపీ ప్రజలు ఇప్పుడు ప్రత్యామ్మాయ వ్యక్తి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆ లోటును చేసేందుకు జనసేనాని ముందుకొచ్చాడు. ప్రజల్లో నమ్మకం కలిగిస్తున్నాడు. జగన్ కు ధీటుగా ఎదుగుతున్నాడు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ పై ప్రజల్లో రోజురోజుకు వస్తున్న ఆదరణను చూసిన టీడీపీ మీడియాకు నమ్మకం కుదిరినట్టు ఉంది. అందుకే ఇప్పుడు టీడీపీ కంటే వైసీపీ బెటర్ అని.. లోకేష్ కంటే పవన్ కళ్యాణ్ నూరు పాళ్లు నయమని అనుకుంటున్నట్టు తెలిసింది.

సాధారణంగా రాజకీయాల్లో వారసులకు మొదటి నుంచి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. తండ్రులను చూసి వారే ఎదుగుతారు. మన కేటీఆర్ లాగా.. కానీ చంద్రబాబును చూసి ఆస్థాయిలో లోకేష్ ఎదగలేదు. ఆయనకు తెలుగు నేర్పించడం నుంచి రాజకీయ పాఠాల వరకూ చంద్రబాబు మొదటి నుండి శిక్షణ ఇప్పించారు. అయినా ప్రజల్లోకి వెళితే హ్యాండిల్ చేయడంలో ప్రావీణ్యం సంపాదించలేక తటపటాయిస్తున్నారు.
ఇప్పుడు టీడీపీ, దాని అనుకూల మీడియాకు లోకేష్ పై నమ్మకం సడలుతోంది. టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు తప్ప, టీడీపీలో మరో నేత కంటికి కనిపించడం లేదు. టీడీపీ సానుభూతిపరులైన మీడియా సంస్థలు లోకేశ్ ఇమేజ్‌ను ఎంత పెంచినా ఆయన ఆదరణ చూరగొనడం లేదు. లోకేష్ ను ఎవరూ నమ్మడం లేదు.
ఇక ఏపీలో జగన్ ను చంద్రబాబు కంటే కూడా ధీటుగా ఎదుర్కొంటూ దూసుకొచ్చారు పవన్ కళ్యాణ్. సభలు, సమావేశాల్లో వైసీపీ నేతలపై విరుచుకుపడుతూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకొని టీడీపీ పొత్తు కోసం ఆసక్తి చూపిన పవన్ కళ్యాన్ ను ఏపీ రాజకీయాల్లో లేపాలని టీడీపీ మీడియా అనుకుంటోంది. టీడీపీకి పవన్ కళ్యాణ్ మిత్రపక్షం కావడంతో ఆయనకు కావాల్సినంత లిఫ్ట్ ఇచ్చేందుకు టీడీపీ మీడియా ఆయనను ఎంపిక చేసుకున్నట్టు తెలిసింది. దీంతో పచ్చ మీడియా నుంచి ఆయనకు కావాల్సినంత మైలేజ్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది.
టీడీపీకి మద్దతు ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ ను బీజేపీ లాక్కుంటే చంద్రబాబు చాప్టర్ క్లోజ్ అవుతుంది. పార్టీని భవిష్యత్తులో నడిపించే నాయకుడే లేడు. దీంతో టీడీపీకి జగన్ చరమగీతం పాడుతాడు. అందుకే టీడీపీ మీడియా తన పార్టీని బతికించేందుకు పవన్ కళ్యాణ్ ను పెంచి పోషించడం తప్ప మరో మార్గం లేదని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అందుకే పవన్ కళ్యాణ్ కు టీడీపీ మీడియాలో తాజాగా అగ్రతాంబూలం దక్కుతోంది.
ఇక జనసేన ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని టీడీపీ మీడియాను ఉపయోగించుకుని ప్రజల్లో సానుభూతి, పాపులారిటీ పొందాలని పవన్ కల్యాణ్‌కు కొందరు సన్నిహితులు సలహా ఇచ్చారని, కానీ అలాంటి ఉద్దేశం పవన్ కు లేదని సమాచారం. కానీ టీడీపీ మీడియా మాత్రం పవన్ కళ్యాణ్ ఎలుగెత్తి చాటిన సమస్యలపై ఫోకస్ చేసి ఆయనను మీడియాలో హైలెట్ చేస్తోంది. అందుకే ఏపీలో రైతుల సమస్యలు, రోడ్ల పరిస్థితిపై పవన్ ప్రచారానికి మీడియాలో అధిక ప్రాధాన్యత దక్కుతోంది. ఇదంతా పవన్ కల్యాణ్‌కు విస్తృత ప్రచారం కల్పించడమేనని అంటున్నారు.
మొత్తంగా టీడీపీలో దిక్కులేకనే ఆ మీడియా అవసరార్థం పవన్ కళ్యాణ్ ను హైలెట్ చేయాల్సిన పరిస్థితులు ఏపీలో ఏర్పాడ్డాయని ఇన్ సైడ్ టాక్ నడుస్తోంది. అందరిపై దుమ్మెత్తి బట్టలూడదీసే టీడీపీ మీడియా పవన్ నామ జపం వెనుక కారణం అదేనంటున్నారు.