Liger Trailer: డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘లైగర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అందుకే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. కాగా ఈ సినిమా ట్రైలర్ జులై 21, 2022న విడుదల కానుంది. హైదరాబాద్ లోని ఆర్టీసి క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్‌లో ఉదయం 9:30 గంటలకు తెలుగు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనుంది.

అలాగే జూలై 21, 2022న ముంబైలోని అంధేరిలోని సినీపోలిస్‌లో రాత్రి 7:30 గంటలకు ముంబై ఈవెంట్ జరగనుంది. ఇక ఈ సినిమా నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన పోస్టర్ బాగా వైరల్ అయ్యింది. ఈ పోస్టర్‌లో విజయ్ దేవరకొండ డ్రెస్ లేకుండా పికే సినిమాలో అమీర్ ఖాన్ స్టైల్ లో దర్శనం ఇచ్చాడు. ఈ పోస్టర్‌లో విజయ్ దేవరకొండ న్యూడ్‌గా కనిపించడమే.. మెయిన్ హైలైట్ అనుకుంటే, గులాబీలను అడ్డు పెట్టుకుని కనిపించడం మరో హైలైట్.
ఈ సినిమా అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చిందని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ తన కెరీర్ లో కీలకమైన రెండేళ్ళ సమయాన్ని పూర్తిగా ‘లైగర్’ సినిమాకే కేటాయించాడు. పూరి కూడా ఒక సినిమా కోసం ఈ స్థాయిలో ఎప్పుడూ సమయాన్ని కేటాయించలేదు. అందుకే విజయ్ దేవరకొండ ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు.

కాగా విజయ్ కి సినిమా చాలా బాగా నచ్చిందట. సినిమా అద్భుతంగా వచ్చిందని, కచ్చితంగా పాన్ ఇండియా రేంజ్ లో సినిమా సూపర్ హిట్ అవుతుందని విజయ్ ధీమాగా ఉన్నాడు. అన్నిటికీ మించి దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. పైగా బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్, ఛార్మి, పూరి జగన్నాథ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అందుకే హిందీలో కూడా లైగర్ పై భారీ అంచనాలు ఉన్నాయి.
Also Read:Janhvi Kapoor: సీత ‘రామాయణం’లో జాన్వీ కపూర్.. మరీ కంగనా పరిస్థితి ఏమిటి ?
[…] Also Read: Liger Trailer: విజయ్ దేవరకొండ ‘లైగర్’ ట్రైలర్ … […]
[…] Also Read: Liger Trailer: విజయ్ దేవరకొండ ‘లైగర్’ ట్రైలర్ … […]
[…] Also Read: Liger Trailer: విజయ్ దేవరకొండ ‘లైగర్’ ట్రైలర్ … […]
[…] Also Read:Liger Trailer: విజయ్ దేవరకొండ ‘లైగర్’ ట్రైలర్ … […]