Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పై రోజురోజుకు పెరుగుతున్న గురి

మోడీ ఆప్యాయంగా పవన్ ను పలకరించారు. మోడీ పవన్ భేటిపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఆమంచి స్వామి వచ్చి జనసేనలో చేరారు. రేపు పంచకర్ల రమేష్ వచ్చి చేరుతున్నారు. అన్నీ సవ్యంగా కుదిరితే.. పెద్ద సీనియర్ నాయకుడు కొణతాల రామకృష్ణ కూడా జనసేనలో చేరే అవకాశాలు ఉన్నాయి.

Written By: NARESH, Updated On : July 19, 2023 5:12 pm
Follow us on

Pawan Kalyan : మోడీ పక్కన పవన్ కళ్యాణ్ ఫొటో.. ఢిల్లీలో ఎన్డీఏ మీటింగ్ లో ఎంతో మంది హేమాహేమీలు ఉండగా.. మోడీ పక్కన పవన్ కళ్యాణ్ నిలుచొని ఉన్న ఫొటో చూసి అభిమానులు కేరింతలు కొడుతున్నారు. ఈ ఫొటో చూసి కొందరు ఈర్ష్య పడుతున్నారు. మెల్లమెల్లగా పవన్ పడుతున్న కష్టానికి గుర్తింపు వస్తుందని చెప్పొచ్చు.

మోడీ ఆప్యాయంగా పవన్ ను పలకరించారు. మోడీ పవన్ భేటిపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఆమంచి స్వామి వచ్చి జనసేనలో చేరారు. రేపు పంచకర్ల రమేష్ వచ్చి చేరుతున్నారు. అన్నీ సవ్యంగా కుదిరితే.. పెద్ద సీనియర్ నాయకుడు కొణతాల రామకృష్ణ కూడా జనసేనలో చేరే అవకాశాలు ఉన్నాయి.

విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన పంచకర్ల రమేష్ బాబు పవన్ ను కలిశారు. పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. మరో ఇద్దరు మాజీ మంత్రులు సైతం జనసేనలో చేరడానికి నిర్ణయించుకున్నారు. వీరిరువురు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితులు కావడం విశేషం. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట నడిచారు. ఇప్పుడు పవన్ వెంట నడవాలని నిర్ణయానికి వచ్చారు మాజీ మంత్రులు డీఎల్ రవీంద్రారెడ్డి, కొణతాల రామక్రిష్ణలు కూడా లైనల్లో ఉన్నారు.

కడప జిల్లా మైదకూరు నియోజకవర్గం నుంచి వరుసగా ఆరుసార్లు విజయం సాధించారు డీఎల్ రవీంద్రారెడ్డి. మంత్రిగా కూడా పనిచేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి జై కొట్టారు. కానీ ఎన్నికల అనంతరం వైసీపీకి దూరమవుతూ వచ్చారు. జగన్ సర్కారు పాలనా వైఫల్యాలపై విమర్శలు సంధిస్తున్నారు. ఆయన టీడీపీలో చేరుతారని అంతా భావించారు. కానీ రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జనసేన అయితే సరైన వేదిక అవుతుందని భావిస్తున్నారు. అందుకే పవన్ తో ఒకసారి చర్చించి పార్టీలో చేరాలన్న అభిమతం తెలియజేస్తారు.

అనకాపల్లి నుంచి ఎంపీగా, ఎమ్మెల్యేగా కొణతాల రామక్రిష్ణ ప్రాతినిధ్యం వహించారు. 1989, 1991 లో ఎంపీగా గెలుపొందారు. 2004లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్ఆర్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. వైసీపీ ఆవిర్భావం తరువాత జగన్ వెంట నడిచారు. 2014లో విశాఖ ఎంపీగా పోటీచేసిన విజయమ్మ తరుపున విస్తృతంగా ప్రచారం చేశారు. 2019లో మాత్రం టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేశారు. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ గెలవలేదు. ఇటీవల టీడీపీలో చేరతారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా జనసేన వైపు ఆయన మనసు మళ్లింది. పవన్ తో భేటీ తరువాత జనసేనలో చేరికపై స్పష్టతనిస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు.

మొత్తానికైతే పవన్ ఇలా గేట్లు ఎత్తేరో లేదో.. జనసేనలో చేరికల సంఖ్య పెరుగుతోంది. పవన్ కళ్యాణ్ పై రోజు రోజుకు పెరుగుతున్న గురిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..