Pawan Kalyan : నమ్ముకున్న వాళ్ళను నట్టేట ముంచినా నోరెత్తవద్దు అంటే ఎలా?

నమ్ముకున్న వాళ్ళను నట్టేట ముంచినా నోరెత్తవద్దు అంటే ఎలా? ఏపీలో పవన్ కళ్యాణ్ రాజకీయంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : March 12, 2024 3:32 pm

Pawan Kalyan : పవన్ కళ్యాణ్.. అసలు ఆ ఒప్పందం ఏంటి? పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి ఎక్కడికి దిగిపోయాడు. ప్రత్యామ్మాయ రాజకీయ స్లోగన్ తో వచ్చి.. రాజ్యాధికారాన్ని త్యాగం చేసే దాకా వెళ్లిపోయాడు. త్యాగరాజుగా పేరొచ్చింది పవన్ కు.. ఇదేనా జనసైనికులు కోరుకున్నది..?

పవన్ కళ్యాణ్ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ముందుకొచ్చిన వారిలో ఇప్పుడు పూర్తిగా సీట్లపై ఆశలు అడుగంటాయి. ఈ 21 సీట్లు తీసుకునే బదులు ఆ రెండు ఎంపీ, 21 ఎమ్మెల్యే సీట్లను టీడీపీ, బీజేపీకి ఇచ్చేసి భేషరతుగా మద్దతు పలికి వారికి ప్రచారం చేస్తే ఇంకా హుందాగా ఉండేది పరిస్థితి. మాట్లాడితే జగన్ బూచీ అంటున్న పవన్ కళ్యాణ్.. ఆ సోయ చంద్రబాబుకు లేదా? చంద్రబాబు సీట్లు ఇవ్వడానికి ఇష్టపడడా? జగన్ ను ఓడించాలన్న ఏకైక లక్ష్యం పవన్ కే ఉందా? టీడీపీకి లేదా? అన్నది ఇక్కడ ప్రశ్న..

ఈ పొత్తు వల్ల నష్టపోయింది ఇద్దరు.. సామాజికపరంగా కాపులు, బలహీన వర్గాలు నష్టపోయారు. ఇక రెండోది రాజకీయంగా నష్టపోయింది బీజేపీనే.. 10 సీట్లు ఇచ్చినా కూడా బీజేపీకి నష్టమే..

నమ్ముకున్న వాళ్ళను నట్టేట ముంచినా నోరెత్తవద్దు అంటే ఎలా? ఏపీలో పవన్ కళ్యాణ్ రాజకీయంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.