BCCI: ఐపీఎల్ పై బీసీసీఐ గుడ్ న్యూస్.. రెండు బాడ్ న్యూస్ లు

గాయాల నుంచి కోలుకున్న తర్వాత రిషబ్‌ వికెట్‌ కీపర్‌గా, బ్యాట్స్‌మెన్‌గా ఎన్సీఏ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాత ప్రాక్టీస్‌ మొదలు పెట్టాడు. పూర్తి ఫిట్‌నెస్‌ సాధించడంతో ఎన్సీఏ క్రియరెన్స్‌ ఇచ్చింది.

Written By: Raj Shekar, Updated On : March 12, 2024 2:56 pm

BCCI

Follow us on

BCCI: రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువ క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. రెండేళ్ల తర్వాత ఆయన మళ్లీ బరిలో దిగబోతున్నారు. ఎన్సీఏ నుంచి ఫిట్‌నెస్‌ క్లియరెన్స్‌ అందుకున్న పంత్‌కు బీసీసీఐ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో మార్చి 21 నుంచి జరిగే ఐపీఎల్‌ ఆడే అవకాశం ఉంది. ఈమేరకు బీసీసీఐ ప్రకటన కూడా చేసింది. గతంలో ఢిల్లీకి ఆడిన పంత్‌.. తిరిగి ఆ జట్టు సారధిగా బరిలో దిగుతాడని తెలుస్తోంది.

రెండేళ్ల తర్వాత..
2022 డిసెంబర్‌ 30న రిషబ్‌ పంత్‌ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతను రెండేళ్లపాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. తాజాగా ఐపీఎల్‌ –2024 ద్వారా మైదానంలో అడుగు పెట్టబోతున్నాడు. పంత్‌ పూర్తి ఫిట్‌గా ఉన్నడాని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ(ఎన్సీఏ) ప్రకటించింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ సారథిగా బరిలో దిగేందుకు రిషబ్‌ రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో బీసీసీఐ కూడా రిషబ్‌ ఐపీఎల్‌ ఆడతాడని ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు.

ఎన్సీఏ వైద్యుల పర్యవేక్షణలో…
గాయాల నుంచి కోలుకున్న తర్వాత రిషబ్‌ వికెట్‌ కీపర్‌గా, బ్యాట్స్‌మెన్‌గా ఎన్సీఏ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాత ప్రాక్టీస్‌ మొదలు పెట్టాడు. పూర్తి ఫిట్‌నెస్‌ సాధించడంతో ఎన్సీఏ క్రియరెన్స్‌ ఇచ్చింది. దీంతో ఐపీఎల్‌లో బరిలో దిగడానికి రెడీ అవుతున్నాడు. రిషబ్‌ పునరాగమనంపై ఢిల్లీ క్యాపిటల్స్‌ డైరెక్టర్‌ సౌరభ్‌ గంగూలీ స్పందించారు. ‘రిషభ్‌ తిరిగి ఫిట్‌గా రావడం మాకు పెద్ద అదనపు అంధశం. అతను చాలా ప్రత్యేమైన ఆటగాడు. అతను పూర్తి సీజన్‌ ఆడతాడని ఆశిస్తున్నాం అన్ని ఫార్మాట్లలో రాణించిన కొందరు దేశవాళీ ఆటగాళ్లపై మే పనిచేశాం. కానీ, పంత్‌ చాలా ముఖ్యం’ అని పేర్కొన్నాడు.

మ్యాచ్‌ ఆడితేనే..
ఇక పంత్‌ ఆట తీరుపై ఇప్పుడే ఏం చెప్పలేమని గంగూలీ వ్యాఖ్యానించారు. అతడు మ్యాచ్‌ ఆడిన తర్వాతే అతడి ఆటపై స్పందిస్తానని ప్రకటించారు. పంత్‌ జట్టుకు సారథ్యం వహిస్తాడని ఢిల్లీ క్యాపిటల్స్‌ సహ యజమాని పార్థ్‌ జిందాల్‌ తెలిపారు. మార్చి 23న మొహాలీ వేదికగా పంజాబ్‌ కింగ్సతో ఢిల్లీ క్యాపిటల్స్‌ తొలి మ్యాచ్‌ ఆడనుంది.

వాళ్లు దూరం..
ఇదిలా ఉంటే ఇద్దరు ఆటగాళ్లు ఆడడం లేదని బీసీసీఐ ప్రకటించింది. గాయాల కారణంగా ప్రసిద్ధ్‌ కృష్ణ(రాజస్థాన్‌ రాయల్స్‌) మహ్మద్‌ షమీ(గుజరా™Œ ) ఐపీఎల్‌ – 2024కు దూరమయ్యారని ప్రకటించింది.

ఢిల్లీ క్యాపిటల్స్‌ స్క్వాడ్‌ : డేవిడ్‌ వార్నర్, పృథ్వీ షా, రిషబ్‌ పంత్, యశ్‌ ధూల్, అభిషేక్‌ పోరెల్, అక్షర్‌ పటేల్, లలిత్‌ యాదవ్, మిచెల్‌ మార్‌‡్ష, ప్రవీణ్‌ దూబే, విక్కీ ఓస్వాల్, అన్రిచ్‌ నోర్జే, కుల్దీప్‌ యాదవ్, లుంగీ ఎంగిడి, ఖలీల్‌ అహ్మద్, ఇషాంత్‌ శర్మ, ముఖేష్‌ కుమార్, హ్యారీ బ్రూక్, ట్రిస్టాన్‌ స్టబ్స్, రికీ భుయ్, కుమార్‌ కుషాగ్రా, రసిఖ్‌ దార్, జై రిచర్డ్సన్, సుమిత్‌ కుమార్, షాయ్‌ హోప్‌.