Bhatti Vikramarka And Surekha : యాదాద్రిలో రెడ్డి త్రయం ప్రవర్తన ఎలా సమర్థనీయం?

యాదాద్రిలో రెడ్డి త్రయం ప్రవర్తన ఎలా సమర్థనీయం? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..

Written By: NARESH, Updated On : March 12, 2024 3:18 pm

Bhatti Vikramarka And Surekha : యాదాద్రి ఘటన దుమారం రేపింది.. ఇది చిన్న సంఘటన కాదు. దీన్ని బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వివాదంగా మలుస్తున్నారు. ప్రస్తుతం మీడియాలో ఒకటే చర్చ.. ఉప ముఖ్యమంత్రి, దళిత నాయకుడు మల్లు భట్టి విక్రమార్కను కింద కూర్చోబెట్టారు.. బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి కొండా సురేఖను అవమానించారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇంకో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పైన కూర్చున్నారు.. ఇంతకు మించిన దారుణం ఉంటుందా.. దళితులను ఈ స్థాయిలో చిన్నచూపు చూస్తున్నారు.. బీసీలను అణగదొక్కుతున్నారు.చివరికి ప్రభుత్వ ప్రకటనల్లోనూ రేవంత్ రెడ్డి ఫోటో మాత్రమే వేస్తున్నారు.. ఇక ఎమ్మెల్సీ కవిత అయితే రేవంత్ క్షమాపణ చెప్పాలని.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే ఇది దళితులకు జరిగిన అన్యాయమని… ఇలా రకరకాల విశ్లేషణలు.. వాదనలు.. ఇంతకీ ఇందులో ఎవరి వాదన కరెక్టు? ఎవరి విశ్లేషణ కరెక్టు?

యాదగిరిగుట్టలో పూజల కోసం సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన సతీమణి గీత, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి వెళ్లారు. అక్కడి పూజల్లో పాల్గొన్నారు. ఇంతవరకు ఉంటే బాగానే ఉండేది. కానీ అక్కడ జరిగిన పూజల్లో ముఖ్యమంత్రి, ఆయన సతీమణి, మరో ఇద్దరు రెడ్డి మంత్రులు పక్క పక్కన కుర్చీల్లో కూర్చున్నారు. ఇటు సురేఖ, అటు విక్రమార్క కింద కూర్చున్నారు.. ఇలా ఎందుకు జరిగిందనేదానికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని కవిత నుంచి ప్రవీణ్ కుమార్ దాకా డిమాండ్ చేస్తున్నారు. గుడి కాబట్టి అందరూ సమానమే కదా, అలాంటప్పుడు కొందరు కుర్చీలో ఎందుకు కూర్చోవాలి? ఇంకా కొందరు కింద ఎందుకు కూర్చోవాలి అనేది వారి ప్రధాన ఆరోపణ. వారు చేస్తున్న ఆరోపణకు తగ్గట్టుగానే అక్కడ సన్నివేశం కూడా ఉంది. సో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది.

యాదాద్రిలో దళిత డిప్యూటీ సీఎంను కింద కూర్చోబెట్టారు. దీన్ని అనుకోకండా జరిగింది.. కావాలని చేసింది కాదని.. క్షమించాలని చెప్పుంటే చాలా హుందాగా ఉండేది. సమస్య సమిసిపోయేది. బీఆర్ఎస్ సమయంలోనూ దళితులకు జరిగిన అన్యాయంపై కాంగ్రెస్ గళమెత్తారు.

యాదాద్రిలో రెడ్డి త్రయం ప్రవర్తన ఎలా సమర్థనీయం? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..