
Pawan Kalyan donates Rs 1 crore : సినిమా మరియు రాజకీయం అనేది రెండు మహాసముద్రాలు లాంటివి.ఒక దాంట్లో అడుగుపెడితే మరో దాంట్లో అడుగుపెట్టలేం.రెండిటిని సమాంతరంగా బ్యాలన్స్ చెయ్యడం అనితర సాధ్యమైన విషయం. కానీ పవన్ కళ్యాణ్ ఒక పక్క వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతూనే, మరోపక్క రాజకీయాలను కూడా సమర్థవతంగా నడిపిస్తున్నాడు.
ఇటీవలే ఒకపక్క ‘హరి హర వీరమల్లు’ రెగ్యులర్ షూటింగ్ చేస్తూనే మరో పక్క హరీష్ శంకర్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’, డైరెక్టర్ సుజిత్ తో ‘#OG’ వంటి సినిమాలకు పూజ కార్యక్రమాలు చేసాడు.ఈరోజు లేటెస్ట్ గా సాయి ధరమ్ తేజ్ తో కలిసి ఆయన చెయ్యబోతున్న ‘వినోదయ్యా సీతం’ సినిమా ప్రారంభమై , రెగ్యులర్ షూటింగ్ కూడా ఈరోజు నుండే మొదలైంది.ఉదయం ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాని ఒక రేంజ్ లో ఊపేస్తున్నాయి.పవన్ కళ్యాణ్ ని ఇంత అల్ట్రా స్టైలిష్ లుక్ లో చూసి చాలా కాలం అయ్యింది అంటూ అభిమానులు మురిసిపోతున్నారు.
అయితే ఉదయం అలా షూటింగ్ లొకేషన్ లో కనిపించిన పవన్ కళ్యాణ్ , సాయంత్రానికి జనసేన పార్టీ కార్యకలాపాలలో నిమగ్నమైపోయాడు. నేడు సాయంత్రం ఆయన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా అందిస్తున్న ప్రమాద బీమా కార్యక్రమానికి తనవంతుగా 1 కోటి రూపాయల విరాళాన్ని పార్టీ పీఏసీ ఛైర్మెన్ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కి , మరియు కోశాదిఖారి ఎ.వి రత్నం గారికి అందజేశాడు. అలా ఉదయం షూటింగ్ ప్రారంభించగానే, సాయంత్రానికి ఇలా విరాళం ఇవ్వడం పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది.
ఈ బీమా యొక్క ముఖ్య ఉద్దేశ్యం జనసేన పార్టీ లో క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు ఏదైనా జరిగితే ఆ కుటుంబ సబ్యులకు 5 లక్షల రూపాయిలు ఆర్ధిక సహాయం అందుతుంది.ఇప్పటికే పవన్ కళ్యాణ్ అలా చాలా మందికి సహాయం చేసాడు.భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఇలాంటి పథకాన్ని ప్రవేశ పెట్టిన ఏకైక పార్టీ గా జనసేన పార్టీ నిలిచింది.