
Aamir Khan On Mahesh-Rajamouli Movie: కోట్లాది మంది అభిమానులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు రాజమౌళి మూవీ ఎట్టకేలకు కార్యరూపం దాల్చిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ మరియు ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న రాజమౌళి, ఈ ఏడాది చివరి నుండి ఈ సినిమాని సెట్స్ మీదకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా గురించి ఎన్నో వార్తలు బయటకి వచ్చాయి,ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ఏమిటంటే ఈ సినిమా కోసం రాజమౌళి వెయ్యి కోట్ల రూపాయిల బడ్జెట్ ని పెట్టబోతున్నాడట.#RRR సినిమా తో మన తెలుగు సినిమాకి పాన్ వరల్డ్ మార్కెట్ కూడా రావడం తో ప్రపంచం లో ఉన్న 30 బాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారట.అంతే కాదు కాస్టింగ్ కూడా వేరే లెవెల్ లో ఉండబోతుందని టాక్.ఇప్పటికే పలువురు హాలీవుడ్ స్టార్ హీరోల పేర్లు వినిపించాయి.
కేవలం హాలీవుడ్ టెక్నిషియన్స్ మరియు హాలీవుడ్ నటులు మాత్రమే కాకుండా, ఈ సినిమాలో ఇండియన్ సూపర్ స్టార్స్ కూడా కనిపించబోతున్నారు.అందుతున్న కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమిర్ ఖాన్ ఒక ముఖ్య పాత్ర పోషించబోతున్నాడట.ఇటీవలే రాజమౌళి అమిర్ ఖాన్ ని కలిసి రిక్వెస్ట్ చెయ్యగా , అమిర్ ఖాన్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.రాజమౌళి అంటే అమిర్ ఖాన్ కి మొదటి నుండి ఎంతో అభిమానం.పబ్లిక్ ఈవెంట్స్ లో రాజమౌళి పై తనకి ఉన్న ప్రేమని చాలా సార్లు చెప్పుకొచ్చాడు అమిర్ ఖాన్.

ఇక ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఆయనకీ ఉన్న స్టార్ స్టేటస్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.7 క్రితం విడుదలైన దంగల్ సినిమా ఇప్పటికి ఆల్ టైం టాప్ 5 ఇండియన్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది.అలాంటి సూపర్ స్టార్ ఈ ప్రాజెక్ట్ లో భాగం అవ్వడం అంటే కచ్చితంగా ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళినట్టే చెప్పొచ్చు.చూడాలి మరి రాబొయ్యే రోజుల్లో ఇంకెన్ని సర్ప్రైజ్ లు ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుండి రాబోతున్నాయి అనేది.
