T20 World Cup 2022: కర్మ ఫలం ఎప్పుడూ ఒకే తీరుగా ఉంటుంది. గెలిచామని విర్రవీగొద్దు. ఓడిపోయామని బాధపడొద్దు. గత టి20 వరల్డ్ కప్ మెన్స్ సిరీస్ లో భారత జట్టు పేలవ ప్రదర్శన కారణంగా మొదటి రౌండ్ లోనే ఇంటి బాట పట్టాల్సి వచ్చింది. సమయంలో “బాయ్ బాయ్ భారత్” అంటూ పాకిస్తాన్ అభిమానులు ఫ్లకార్డులతో హేళన చేశారు. సరిగ్గా సంవత్సరం తిరిగేసరికి ఇప్పుడు వారి జట్టు కూడా గ్రూప్ దశలోనే ఇంటి బాట పడుతున్నది. గత సంవత్సరం పాకిస్తాన్ అభిమానుల చేతిలో ట్రోల్ కు గురై భారత క్రికెటర్లు చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. భారత అభిమానుల చేతిలో పాకిస్తాన్ క్రీడాకారులు ట్రోల్ కు గురవుతున్నారు.

సౌత్ ఆఫ్రికా విజయంతో..
టి20 ప్రపంచకప్ లో ఆదివారం సూపర్ 12 మ్యాచ్లో భాగంగా గ్రూప్-2 లో ఉన్న టీం ఇండియా పై సౌత్ ఆఫ్రికా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. సౌత్ ఆఫ్రికా సాధించిన విజయంతో పాకిస్తాన్ అనధికారికంగా టీ 20 ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించినట్టే. టీమిండియా, సౌత్ ఆఫ్రికా జట్టుతో తలపడే ముందు నెదర్లాండ్స్ ను చేసిన పాకిస్తాన్ కు ఆ సంతోషం ఒక్కరోజు కూడా మిగల్లేదు.. నెదర్లాండ్స్ పై పాకిస్తాన్ ఆడిన తీరు చూశాక వాళ్లు సెమీస్ కు వెళ్ళినా పెద్దగా ఉపయోగం లేదని స్పష్టంగా తెలిసింది. ఎందుకంటే నెదర్లాండ్స్ విధించిన 91 పరుగు లక్ష్యాన్ని అందుకునేందుకు పాకిస్తాన్ నానా తంటాలు పడింది. మహమ్మద్ రిజ్వాన్ మినహా మిగతా వాళ్ళు పెద్దగా ఆకట్టుకోలేదు. టార్గెట్ చిన్నది కాబట్టి సరిపోయింది. లేకుంటే జింబాబ్వే మాదిరే అండ్ నెదర్లాండ్స్ కూడా అద్భుతం చేసేది.. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా విజయం అందుకోవడంతో పాక్ సెమీస్ కు వెళ్లే దారులు దాదాపు మూసుకుపోయినట్టే. ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టును టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ తో భారత అభిమానులు రెచ్చిపోయారు. బై బై పాకిస్తాన్ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్విట్టర్లో ట్రెండింగ్ చేస్తున్నారు.
అదే మలుపు తిప్పింది
ఇక మీమ్స్ విషయానికి వస్తే సౌత్ ఆఫ్రికా తో మ్యాచ్ లో కోహ్లీ మార్క్రమ్ క్యాచ్ వదిలేసిన సంగతి తెలిసిందే. ఇక్కడే మ్యాచ్ టర్న్ అయిందని చెప్పొచ్చు. దీనిని కొందరు అభిమానులు వ్యంగ్యంగా పేర్కొంటున్నారు.. కోహ్లీ వదిలేసిన బంతిని పాక్ జట్టు లాగా అభివర్ణిస్తున్నారు. ” కోహ్లీ పార్టీ జట్టును కరాచీ ఎయిర్ పోర్ట్ లో విజయవంతంగా డ్రాప్ చేశాడు అంటూ” మీమ్ పెట్టడం వైరల్ గా మారింది. దీంతోపాటు చాలా మీ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయి.

దాని వెనుక ఒక కథ దాగుంది
ఇక బై బై పాకిస్తాన్ అని మీమ్ పెట్టడం వెనుక ఒక చిన్న కథ దాగి ఉంది. గత సంవత్సరం టి20 ప్రపంచ కప్ లో టీం ఇండియాకు ఇదే పరిస్థితి ఎదురైంది.. ఆ ప్రపంచకప్ లో పాకిస్తాన్ తో ఓడిపోయిన టీం ఇండియా… న్యూజిలాండ్ చేతిలోనూ పరాజయం పాలైంది.. అయితే ఆఫ్గనిస్తాన్ తో మ్యాచ్లో కివీస్ ఓడిపోతే టీం ఇండియాకు సెమిస్ అవకాశాలు ఉండేవి. కానీ న్యూజిలాండ్ గెలుపొందడంతో టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. అప్పుడు కొంతమంది పాకిస్తాన్ అభిమానులు బై బై ఇండియా అంటూ హ్యాష్ ట్యాగ్ లు పెట్టారు. ఈసారి పాకిస్తాన్ కు కూడా అదే పరిస్థితి రావడంతో లెక్క సరిపోయింది అంటూ క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు.
లెక్కలు ఎలా ఉన్నాయి అంటే
టీం ఇండియా పై విజయం సాధించడంతో సౌత్ ఆఫ్రికా రెండు విజయాలు, ఒక మ్యాచ్ రద్దు తో పాయింట్లు పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. టీమిండియా మూడు మ్యాచ్ ల్లో రెండు విజయాలు, ఒక ఓటమితో రెండో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ కూడా రెండు విజయాలు, ఒక ఓటమితో మూడో స్థానంలో ఉంది.. అయితే టీమిండియా తన తర్వాత మ్యాచ్ లను జింబాబ్వే, బంగ్లాదేశ్ లతో ఆడాల్సి ఉంటుంది. వీటిలో ఒక్క మ్యాచ్ గెలిచినా టీం ఇండియా సెమీస్ కు చేరుతుంది. అయితే రెండు మ్యాచ్ల్లో టీం ఇండియా ఏ చిన్న పొరపాటు చేసినా మొదటికే మోసం వస్తుంది. ఎందుకంటే గెలుపు కోసం జింబాబ్వే, బంగ్లాదేశ్ జట్లు పోరాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఇప్పటికే పాకిస్తాన్, ఇంగ్లాండ్ వంటి జట్లకు చిన్న టీంలు పెద్ద షాక్ ఇచ్చాయి.. పాకిస్తాన్ అయితే ఏకంగా టోర్నీ నుంచి నిష్క్రమించే పరిస్థితులు ఏర్పడ్డాయి. 15 ఏళ్ల తర్వాత టి20 కప్ మళ్లీ సాధించాలనే కసితో ఉన్న రోహిత్ సేన.. ఆటపై మరింత దృష్టి కేంద్రీకరించాలి. లేని పక్షంలో టి20 మెన్స్ వరల్డ్ కప్ మరోసారి దక్కే అవకాశాలు ఉండవు.