Asia Cup Ind vs Pak : సూపర్ ఫ్లోర్ లోకి ఎంట్రీ ఇచ్చిన పాక్.. మరి టీమిండియా ఎక్కడ?

కానీ భారత్ దిగ్గజ బ్యాటర్లు అందరూ షాహీన్ మరియు హరీస్ రవూఫ్‌ల పేస్ ద్వయాన్ని ఎదుర్కోవడానికి చాలా కష్టపడ్డారు. ఇప్పటికైనా బ్యాటింగ్ పై దృష్టి పెట్టకపోతే రాబోయే మ్యాచ్లలో టీం ఇండియా పరిస్థితి కాస్త కష్టమే మరి.

Written By: Vadde, Updated On : September 3, 2023 3:00 pm

Ind vs pak

Follow us on

Asia Cup Ind vs Pak : శ్రీలంకలోని క్యాండీ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ లో భాగంగా భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇండియన్ క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ నేపథ్యంలో షార్ట్ సెలక్షన్ పై భారత్ మాజీ క్రికెటర్ గౌతమ్ గంబి స్టార్ బాటర్ అయిన విరాట్ కోహ్లీపై తనదైన శైలిలో విమర్శలు కురిపించారు. ముందుంచి నడిపించాల్సిన సీనియర్ ప్లేయర్ అయిన కోహ్లీ పాకిస్తాన్ బౌలర్ షాహీన్ అఫ్రిది బౌలింగ్ సమయంలో కనబరిచిన ప్రదర్శనను అత్యంత సాధారణంగా ఉంది అని ఎద్దేవా చేశారు.

మ్యాచ్ మొదట విరాట్ మంచి సిగ్నేచర్ కవర్ డ్రైవ్ తో తన ఆటను ప్రారంభించినప్పటికీ…చివరికి అందరికీ నిరాశ మిగిల్చాడు. చిరకాల ప్రత్యర్థులకు వ్యతిరేకంగా అద్భుతమైన నాకౌట్ ప్రతిభను కనబరిస్తాడు అనుకునే సమయానికి అప్రిది వేసిన బాల్ కి దొరికిపోయాడు. ఆఫ్రిది వేసిన డెలివరీ మొదట కోహ్లీ బ్యాట్ అంచును తాకి తరువాత స్టంప్‌ను తాకింది. ఎదుర్కొన్న ఏడు మంత్రులలో కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేస విరాట్ అవుట్ కావడం భారత్ పై తీవ్రమైన వత్తిడి కలిగించింది.

“విరాట్ ఆడిన షార్ట్ అటు ఫార్వర్డ్ కాదు ఇటు బ్యాక్వర్డ్ కూడా కాదు.షాహీన్ అఫ్రిది లాంటి వ్యక్తితో ఆడుతున్నప్పుడు మరీ ఇంత క్యాజువల్ గా ఉండకూడదు”అని గంభీర్ కూడా వ్యాఖ్యానించారు. మరోపక్క పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ వక్ర్ యూనిస్ ఇది విరాట్ దురదృష్టం అని అభివర్ణించారు. ఇన్సైడ్ ఏజ్ బాల్ బ్యాక్ పైకి రాలేదు.. ఇంకాస్త కిందకే తగిలి ఉండేది.. కానీ షాహీన్ షా ఆఫ్రిది నైపుణ్యం కారణంగా కోహ్లీ అవుట్ అయ్యాడు అని అన్నారు. ఆస్ట్రేలియన్ స్టార్ ఓపెనర్ మాథ్యూ హేడెన్‌ కూడా ఈ స్టేట్మెంట్తో ఏకీభవించారు.

మొన్న నేపాల్ తో జరిగిన తొలి మ్యాచ్లో విజయం సాధించిన పాకిస్తాన్ గతంలో రెండు పాయింట్లు తన ఖాతాలో వేసుకుంది. భారత్ పాకిస్తాన్ మధ్య గ్రూప్ స్టేజ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో రెండు జట్లు ఒక్కో పాయింట్ పంచుకోవడం జరిగింది. ఈ క్రమంలో మొత్తం రెండు మ్యాచ్లకు గాను మూడు పాయింట్లు సాధించి పాక్ జట్టు సూపర్ ఫోర్ కు అర్హత సాధించింది. మరోపక్క కేవలం ఒక్క పాయింట్కే పరిమితమైన భారత టీం సూపర్ ఫోన్లో ఎంట్రీ ఇవ్వాలి అంటే సెప్టెంబర్ 4న జరిగే తదుపరి మ్యాచ్లో నేపాల్ ను ఓడించి తీరాలి.

పాక్తో జరిగిన భారత్ మ్యాచ్ బ్యాటింగ్ వివరాల విషయానికి వస్తే రోహిత్ శర్మ (11), విరాట్ కోహ్లీ (4) మరియు హరీస్ శ్రేయాస్ అయ్యర్ (14), శుభమాన్ గిల్ (10)లను పొందారు.ఇషాన్ కిషన్ (81 బంతుల్లో 9 ఫోర్లు, రెండు సిక్సర్లతో 82),హార్దిక్ పాండ్యా (90 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ తో 87) పరుగులు సాధించి కాస్త టీమిండియా పరువు నిలబెట్టారు. 138 పరుగుల భాగస్వామ్యంతో భారత్ ను రెండు వందల స్కోర్ దాటించడంలో ఈ ఇద్దరి ప్లేయర్లు తమ వంతు కృషి చేశారు.

ఇక వీరి తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన రవీంద్ర జడేజా (14), జస్ప్రీత్ బుమ్రా (16) అందించిన సహకారంతో భారత్ 250 పరుగుల మార్కును దాటింది. కానీ భారత్ దిగ్గజ బ్యాటర్లు అందరూ షాహీన్ మరియు హరీస్ రవూఫ్‌ల పేస్ ద్వయాన్ని ఎదుర్కోవడానికి చాలా కష్టపడ్డారు. ఇప్పటికైనా బ్యాటింగ్ పై దృష్టి పెట్టకపోతే రాబోయే మ్యాచ్లలో టీం ఇండియా పరిస్థితి కాస్త కష్టమే మరి.