Anasuya : సింగర్ చిన్మయి శ్రీపాద ఇండస్ట్రీలో స్టార్ సింగర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఒకప్పుడు మీటూ ఉద్యమంతో సౌత్ ఇండస్ట్రీని షేక్ చేసింది. ముఖ్యంగా వైరముత్తు, సింగర్ కార్తీక్ వంటి వారిపై సంచలన ఆరోపణలు చేసింది. తనపై పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ వైరముత్తుకు వ్యతిరేకంగా పోరాటం చేసింది. దీంతో కోలీవుడ్ ఇండస్ట్రీ ఆమెను బ్యాన్ చేసింది. అక్కడ పాటలు పాడటానికి, డబ్బింగ్ చెప్పడానికి లేకుండా ఆమెను నిషేధించారు. దీంతో చిన్మయి పరిశ్రమకు దూరమైంది.
కానీ తన పోరాటాన్ని మాత్రం ఆపలేదు. ఇది పక్కన పెడితే .. చిన్మయి తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఆమె యాంకర్, నటి అనసూయను ప్రవర్తనపై మండిపడింది. గతంలో ఓ షోలో అనసూయ చిన్న పిల్లాడితో కిస్ పెట్టించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే అది చిన్మయి కంటపడటంతో ఓ రేంజ్ లో ఫైర్ అవుతుంది. చిన్న పిల్లలతో ఇలాంటి పనులా చేసేది అంటూ చురకలు వేసింది.
‘ ఒక ఫిమేల్ హోస్ట్ .. ఒక చిన్న పిల్లాడిని ముద్దు ఇవ్వమని అడిగే సీన్ చూశాను. ఆ సీన్ చూసి .. అక్కడి ఆడియన్స్, పేరెంట్స్ తెగ నవ్వుతున్నారు. అంతేకాదు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలాంటివి చేయడం వలన పిల్లల పై దుష్ప్రభావం పడుతుంది. ఒకవేళ ఈ పిల్లాడికి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి క్లాసులు చేబితే .. ఏది కరెక్ట్ ఏది తప్పు అని కన్ఫ్యూజ్ అవుతాడు. పిల్లల మీద, పిల్లలతో ఈ టీవీల్లో చేసే షోలు చాలా భయంకరంగా ఉంటున్నాయి.
ఇది అస్సలు ఫన్ అనిపించుకోదు .. చిన్నారుల భద్రతకు ఇవి ఏమాత్రం ఉపయోగపడవు. సమాజం కూడా వీటిని అంగీకరించకూడదు. ఇదంతా లైంగిక హింస కిందకే వస్తుంది. కానీ ఫన్ ఎప్పటికీ కాదు. దయచేసి అందరూ దీనిని గుర్తించండి అని చిన్మయి రాసుకొచ్చింది. అయితే ఇందులో ఎక్కడా ఆమె ఆ టీవీ షో గురించి కానీ, ఆ యాంకర్ పేరు గానీ ప్రస్తావించలేదు. కానీ ఆమె అనసూయని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
తరచుగా అనసూయ హీరో విజయ్ కొండను టార్గెట్ చేస్తుంది. అతడి మీద పరోక్షంగా విమర్శలు చేస్తుంది. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేస్తారు. దీనిలో భాగంగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ గతంలో అనసూయ డ్రామా జూనియర్స్ లో పాల్గొన్న వీడియో బయటకు తీశారు. ఆ వీడియోలో అనసూయ ఒక పిల్లాడికి లిప్ కిస్ ఇస్తుంది. ఇది అసభ్యకరమైన పని కాదా? అని అనసూయను విమర్శించారు.
ఈ వీడియో చిన్మయి దృష్టికి వెళ్లడంతో ఆమె సీరియస్ గా స్పందించారు. అనసూయ ఆ మధ్య విజయ్ దేవరకొండకు వ్యతిరేకంగా కావాలనే పోస్ట్స్ పెడుతున్నట్లు నేరుగా ఒప్పుకుంది. ఇకపై తాను ఆ పని చేయను. వివాదానికి ఫుల్ స్టాప్ పెడుతున్నట్లు చెప్పింది. కానీ పదే పదే ఆమె అదే చేస్తుంది. ఇది విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ లో అసహనానికి కారణం అవుతుంది.
Web Title: Singer chinmayi sripada indirectly condemns anasuya act
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com