
Naga Chaitanya New House: అక్కినేని నాగ చైతన్య కొత్తగా హైదరాబాద్ లో లగ్జరీ ఇంటి నిర్మించుకున్నారు. చాలా కాలంగా ఇంటి నిర్మాణం జరుగుతుంది. ఈ ఇంటి పనులు మొదలెట్టే నాటికి సమంతతో విబేధాలు ఏర్పడలేదు. ఇద్దరూ కలిసి జీవించేందుకు దీని నిర్మాణం చేపట్టారు. సమంత-నాగ చైతన్య తమ అభిరుచులకు అనుగుణంగా డిజైన్ చేయించుకున్నారు. అయితే ఇప్పుడు నాగ చైతన్య జీవితంలో సమంత లేదు. ఇటీవల నిర్మాణం పూర్తి కావడంతో నాగ చైతన్య నూతన గృహప్రవేశం చేశారు.
కాగా ఉగాది వేళ నాగ చైతన్య ఇంటికి ఓ గెస్ట్ వచ్చారు. ఆయనే మొదటి గెస్ట్ అట. అది ఎవరో కాదు… చందూ మొండేటి. నాగ చైతన్యకు చందూ మొండేటి అత్యంత సన్నిహితుడు. వీరిద్దరి కాంబినేషన్ లో రెండు సినిమాలు విడుదలయ్యాయి. ప్రేమమ్ హిట్ మంచి విజయం సాధించింది. సవ్యసాచి మాత్రం నిరాశపరిచింది. జయాపజయాలతో సంబంధం లేకుండా వీరి మధ్య స్నేహం కొనసాగుతుంది.
ఉగాది పండుగ వేళ చందూ మొండేటిని నాగ చైతన్య తన కొత్త ఇంటికి ఆహ్వానించాడట. ఈ విషయాన్ని తెలియజేస్తూ చందూ మొండేటి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. నాగ చైతన్య కొత్త ఇంటికి వెళ్లడం జరిగింది. నేనే మొదటి గెస్ట్. నాగ చైతన్యకు ధన్యవాదాలు అంటూ ఇంస్టాగ్రామ్ పోస్ట్ పెట్టారు. నాగ చైతన్యతో దిగిన ఫోటో షేర్ చేశారు. చందూ మొండేటి రీసెంట్ మూవీ కార్తికేయ 2 భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.

మరోవైపు నాగ చైతన్య కస్టడీ మూవీలో నటిస్తున్నారు. దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. నటి ప్రియమణి కీలక రోల్ చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషలో మే 12న కస్టడీ చిత్రం విడుదల కానుంది. పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ మూవీ మీద అంచనాలు ఉన్నాయి. నాగ చైతన్య చిత్రాలకు భిన్నంగా సరికొత్త సబ్జెక్టు తో కస్టడీ మూవీ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అలాగే దూత టైటిల్ తో నాగ చైతన్య ఒక వెబ్ సిరీస్ చేశారు. త్వరలో దూత అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.