దేశంలో రోజురోజుకు వ్యవసాయం చేసేవాళ్ల సంఖ్య తగ్గుతోంది. పంట పండించటానికి అయ్యే ఖర్చులు పెరగడం, ఆదాయం తగ్గుతుండటంతో చాలామంది వ్యవసాయం చేయడానికి ఆసక్తి చూపడం లేదు. అయితే కొన్ని పంటలు పండించడం ద్వారా రైతులు అదిరిపోయే లాభాలను పొందడం సాధ్యమవుతుంది. కివి పంట పండించడం ద్వారా రైతులు తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలను పొందవచ్చు.
Also Read: రజినీకాంత్, కమల్ హాసన్ కలిస్తే వాళ్లదే తమిళనాడు?
కేంద్ర ప్రభుత్వం కివి పంటను పండించే రైతులకు సహకారం అందిస్తోంది. ప్రస్తుతం దేశంలోని నాగాలాండ్ రాష్ట్రానికి చెందిన రైతులు కివి పంటను పండించడానికి ఆసక్తి చూపుతుండగా ఇతర రాష్ట్రాల్లో సైతం ఈ పంటను సాగు చేసే రైతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఒక హెక్టార్ పొలంలో కివి పంటను సాగు చేయడం ద్వారా 20 లక్షల నుంచి 25 లక్షల రూపాయల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.
Also Read: రైతుల ఆందోళనలో దాగివున్న నిజానిజాలు
కూరగాయలు, పండ్ల సాగుతో పోల్చి చూస్తే కివిని పండించడం ద్వారా ఎక్కువ మొత్తంలో లాభాలను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. విదేశీ ఫ్రూట్ అయిన కివి పండ్లకు మన దేశంలో ఎక్కువ డిమాండ్ ఉంది. గతంలో ఈ పండ్లను భారత్ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేది. అయితే మన దేశంలో గత కొన్నేళ్ల నుంచి రైతులు ఈ పంటను పండిస్తూ ఉండటం వల్ల విదేశాల నుంచి కివి పంట దిగుమతి అంతకంతకూ తగ్గుతోంది.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్
కివి పండ్లను తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునే అవకాశం ఉంటుంది. వైద్యులు సైతం సూపర్ ఫ్రూట్ గా పిలవబడే కివి పండును తినమని సూచిస్తూ ఉంటారు. ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో సైతం కివి పండ్లు సహాయపడతాయి.