Congress Jodo Yatra: ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ భాజాలంలో దేవం విచ్ఛిన్నం అవుతోందని, వర్గాలుగా విడిపోతోందని, ఈ పరిస్థితి నుంచి దేశాన్ని ఐక్యం చేయడమే లక్ష్యంగా గాంధీ కుటుంబ వారసుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్‌గాంధీ భారత్ జోడో పేరుతో పాదయాత్ర చేపట్టారు. ఈ యాత్రకు మేధావులు, స్వచ్ఛంత సంఘాలు, లౌకిక పార్టీలు కలిసిరావాలని, పౌర సమాజం మద్దతు తెలుపాలని కాంగ్రెస్ పిలుపు ఇచ్చింది. ఈమేరకు ఆయా సంఘాలతో సమావేశం కూడా నిర్వహించారు. పది రోజుల క్రితం యాత్ర కూడా మొదలైంది. తిమిళనాడులో ముగించుకుని ప్రస్తుతం కేరళలో సాగుతోంది. అయితే ఈ యాత్ర సాగుతున్న తీరు, రూట్‌మ్యాప్‌ను పరిశీలిస్తే.. రాహుల్ యాత్ర భారత్ జోడో కాదని, కాంగ్రెస్ జోడో కోసమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

యాత్రపై సీపీఎం విమర్శలు..
భారత జోడో యాత్రపై బీజేపీ నుంచి విమర్శలు రావడం సహజం. ఇంది అందరూ ఊహించిందే. అదేవిధంగా యాత్ర ప్రారంభం నుంచే బీజేపీ నాయకులు ఎదురుదాడి మొదలు పెట్టారు. రాహుల్ ధరించిన టీషర్ట్‌పై విమర్శలు చేశారు. పాస్టర్‌తో సమావేశం, పాస్టర్ చేసిన వ్యాఖ్యలు రచ్చరచ్చ అయ్యాయి. తమిళనాడులో వివేకానందకు వివాళులర్పిచంకపోవడంపై విమర్శలు వచ్చాయి. అయితే వీటిని కాంగ్రెస్ కూడా తిప్పికొడుతోంది. అయితే తాజాగా రాహుల్ యాత్రపై ఇప్పుడు లౌకికవాద పార్టీ సీపీఎం విమర్శలు మొదలు పెట్టింది. ఇది ఎవరూ ఊహించలేదు. యాత్ర ప్రస్తుతం కేరళలో కొనసాగుతోంది. అక్కడ సీపీఎం నేత్రుత్వంలోని ఎల్‌డీఎఫ్(లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్) అధికారంలో ఉంది. మరోవైపు గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడి 20 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. పార్టీకి మంచి పట్టున్న రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడం ద్వారా వచ్చే ఎన్నికల్లోనూ ఎంసీ స్థానాలను నిలబెట్టుకోవచ్చన్న ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. అదే విధంగా సంప్రదాయానికి విరుద్ధంగా కేర ళ ప్రజలు వరుసగా రెండోసారి ఎల్‌డీఎఫ్‌కు పట్టం కట్టారు. దీంతో ఈసారి ఎలాగైనా కేరలలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ నేత్రృత్వంలోని యూడీఎఫ్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాహుల్ యాత్రలో కాంగ్రెస్ స్థానిక ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. వీటిని స్థానిక సీపీఎం తిప్పికొడుతోంది.
బలమున్న రాష్ట్రాల మీదుగా యాత్ర..
కేరళలో రాహుల్ యాత్ర 18 రోజులు కొనసాగనుంది. తమిళనాడులో కేవలం ఐదు రోజులే సాగిన యాత్ర కాంగ్రెస్‌కు పట్టున్న రాష్ట్రంలో 18 రోజులు చేయడం ద్వారా రాహుల్ చేస్తున్న యాత్ర కాంగ్రెస్‌ను బలోపేతం కోసమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందుకు రాహుల్ రూట్‌మ్యాప్‌ను ఉదహరిస్తున్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ విభజన రాజకీయాల నుంచి దేశాన్ని కాపాడేందుకే యాత్ర అని కాంగ్రెస్ చెబుతున్నా గుజరాత్‌లో యాత్ర లేకపోవడం, ఉత్తరప్రదేశలో యాత్ర కేవలం 5 రోజలకే పరిమితం చేయడం చూస్తే పట్టున్న రాష్ట్రాల్లో మరింత పట్టు పెంచుకునే విధంగానే రూట్‌మ్యాప్ రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ప్రభావం తక్కువ ఉన్న, కాంగ్రెస్‌కు బలమున్న కేరళలో 18 రోజులు, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ప్రభావం ఎక్కువ ఉన్న గుజరాత్‌లో అసలు యాత్ర లేకపోవడం, 80 లోక్‌సభ సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్‌లో ఐదు రోజులకే పరిమితం చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
రూట్‌మ్యాప్ ఇలా..
కర్నాటకలో 21 రోజులు, రాజస్థాన్‌లో 21 రోజులు, కేరళలో 18 రోజులు, మధ్యప్రదేశ్‌లో 16 రోజులు, మహారాష్ట్రలో 16 రోజులు, తెలంగాణలో 13 రోజులు యాత్ర షెడ్యూల్ ఉంది. ఆరు రాష్ట్రాల్లో కలిపితే 105 రోజులు యాత్ర సాగుతోంది. మొత్తం యాత్ర 150 రోజులు ఉండగా, అందులో 105 రోజులు ఆరు రాష్ట్రాల్లో ఉండడం, అందులోనూ కాంగ్రెస్ బలమున్న రాష్ట్రాలు కావడం చూస్తే కాంగ్రెస్ కేవలం పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజస్థాన్ కాంగ్రెస్ అధికారంలో ఉంది. మధ్యప్రదేశ్‌లో అధికారంలో ఉండి సింధియా తిరుగుబాటుతో అధికారం కోల్పోయింది. కర్ణాటకలో అధికారంలోకి వస్తామని నమ్ముతోంది. గుజరాత్‌పై ఆశలు వదులుకుంది అని ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా రాహుల్ చేపట్టిన యాత్ర భరాత్ జోడో కోసం కాదని కాంగ్రెస్ బలోపేతం కోసమే అని విశ్లేషిస్తున్నారు.