నిర్మలా సీతారామన్ ఇచ్చిన ప్రసంగం అదిరిపోయింది. కాంగ్రెస్ ను ఎండగట్టడంలో నంబర్ 1 నిర్మలానే అనిపిస్తోంది. ఉదాహరణలతో.. స్టాటిస్టిక్స్ తో ఇంగ్లీష్ తోపాటు హిందీలో కూడా దంచికొట్టింది. శ్వేత పత్రం ప్రకటించింది ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ నే. అన్నింటికి సమయం దొరకకపోవడంతో పరిమితమైన సబ్జెక్ట్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడారు.
నిర్మల కాంగ్రెస్ ప్రభుత్వంలోని కామన్ వెల్త్ గేమ్స్ లో జరిగిన స్కాంను.. జీ20 సదస్సును రెండింటిని పోల్చి చెప్పింది.రెండోది బొగ్గు కుంభకోణం గురించి కాంగ్రెస్ సర్కార్ ను ఏకిపారేసింది. 204 బొగ్గు గనుల కేటాయింపును సుప్రీంకోర్టు ఎందుకు రద్దు చేసింది? ఎందుకు చీవాట్లు పెట్టింది? అన్న దానిపై కాంగ్రెస్ సర్కార్ ను తూర్పార పట్టింది.
బొగ్గు ఉన్న రాష్ట్రాలు ఎందుకు వెనుకబడి ఉన్నాయి. అందుకే మోడీ సర్కార్ ‘డిస్టిక్ మినరల్ ఫండ్’ పేరిట 85వేల కోట్లను ఆయా రాష్ట్రాల్లోని జిల్లాలకు కేటాయించారు. ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం జిల్లాలను అభివృద్ధి చేసింది.
చత్తీస్ ఘడ్, జార్ఖండ్, ఒడిషా, రాజస్థాన్ లలోని జిల్లాల అభివృద్ధికి పెద్దపీట వేశామని చెప్పుకొచ్చింది.
అవినీతి కుంభకోణాల కాంగ్రెస్ ను పార్లమెంటు సాక్షిగా ఎండగట్టిన నిర్మలా సీతారామన్ పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.