Akhanda Trailer Roar: నందమూరి బాలయ్య.. (Nandamuri Balakrishna) సినిమాల్లోనే కాదు బయట కూడా మాస్.. ఊర మాస్. ఆయనలోని మాస్ ఇజాన్ని కరెక్ట్ గా వాడుకోవాలే కానీ ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టగలం.. బాలయ్యతో సీమ ఫ్యాక్షన్ సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో చూశాం. ఇక బాలయ్యలోని మాస్ మసాలాను బయటకు తీసిన మూవీలు ‘లెజెండ్’, సింహా. మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో బాలయ్య పడితే ఇంకేమైనా ఉందా? ఇండస్ట్రీ రికార్డులు బద్దలు అవుతాయి.

వరుసగా మూడోసారి ముచ్చటగా కలిసి చేశారు బాలయ్య-బోయపాటి. ఇటీవల కొన్ని ఫ్లాపుల తర్వాత బోయపాటి కసిగా బాలయ్యను ‘అఖండ’ మూవీలో చూపించాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మాస్ కే దడ పుట్టేలా ‘అఖండ’ ట్రైలర్ తాజాగా రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్ లో బాలయ్యను ఒక ‘అఖండ’ అఘోరాగా చూపించారు. న్యాయం కోసం పోరాడే ఒక యువకుడిగా.. అనంతరం ఒక అఘోరగా రెండు పాత్రలను బాలయ్య అంతే పౌరుషంగా పోషించాడు.
‘అఖండ’ ట్రైలర్ లో ఫస్ట్ టైం విలన్ గా నటుడు శ్రీకాంత్ కనిపించి భీకర విలనిజాన్ని ప్రదర్శించాడు. ఇక బాలయ్యతో చేసిన ఫైట్ యాక్షన్ సీన్లు అయితే నభూతో నభవిష్యతి లాగా ఉన్నాయి. బోయపాటి మార్క్ మాస్ ‘అఖండ’ ట్రైలర్ అదిరిపోయేలా ఉంది. డైలాగులు ఈలలు వేసేలా ఉన్నాయి.
‘అంచనా వేయడానికి నువ్వేమైనా పోలవరం డ్యామా.. పట్టిసీమ తూమా.. పిల్ల కాలువ’ అంటూ బాలయ్య బెదిరించే సీన్ తో ఇక మాస్ ఇజం మొదలుపెట్టేశాడు. ఒక గురువును ఇందులో చూపించి విలన్ ను వెంటేసుకొని తిరిగే వాళ్లతో శ్రీకాంత్ విలనిజం భీకరంగా ఉంది.
అఖండగా బూడిద పూసుకొని అఘోరగా బాలయ్య ఎంట్రీ అదిరిపోయింది. జగపతిబాబు డైలాగులు.. బాలయ్య ఎలివేషన్.. విలన్ శ్రీకాంత్ ను ఎదురించే తీరు.. ‘బుల్డోజర్’ ను అంటూ బాలయ్య డైలాగ్ గూస్ బాంబ్స్ తెప్పించేలా ఉంది.
సమస్యకు పిండం పెడుతానంటూ బాలయ్య ఇంగ్లీష్ డైలాగులు జోడించి విలన్ శ్రీకాంత్ ను భయపెట్టే సన్నివేశాలు ‘అఖండం’గా ఉన్నాయి. ఏకే 47 చేతబట్టి బాలయ్య చెలరేగిపోయిన వైనం చూస్తే సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోయాయి. మరి ట్రైలర్ లోనే ఇంత మసాలా ఉంటే ఇక సినిమా ఎలా ఉంటుందన్నది వేచిచూడాలి.
అఖండ ట్రైలర్
