https://oktelugu.com/

సీడ్యాక్‌లో టెక్నికల్‌ స్టాఫ్‌ ఉద్యోగ ఖాళీలు.. ఎలా దరఖాస్తు చేయాలంటే?

సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 5 టెక్నికల్ స్టాఫ్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. టెక్నికల్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ, వెబ్ అండ్‌ సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌ సెక్యూరిటీ, కంప్యూటర్‌ నెట్‌వర్క్‌ అండ్‌ సిస్టమ్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ నెట్‌వర్క్‌ సెక్యూరిటీ, ఎంబెడెడ్ సిస్టమ్ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. […]

Written By: Kusuma Aggunna, Updated On : November 14, 2021 7:39 pm
Follow us on

సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 5 టెక్నికల్ స్టాఫ్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. టెక్నికల్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ, వెబ్ అండ్‌ సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌ సెక్యూరిటీ, కంప్యూటర్‌ నెట్‌వర్క్‌ అండ్‌ సిస్టమ్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ నెట్‌వర్క్‌ సెక్యూరిటీ, ఎంబెడెడ్ సిస్టమ్ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.

ఇంజనీరింగ్‌ డిప్లొమా (కంప్యూటర్‌ అప్లికేషన్స్‌), గ్రాడ్యుయేషన్‌ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 2021 సంవత్సరం డిసెంబర్ 12 నాటికి 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానంలో అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పవక్ఛు.

రాతపరీక్షలో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లకు నెలకు 35,400 రూపాయల వేతనం లభించే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీల గురించి ఆసక్తిని కలిగి ఉన్నవాళ్లు https://www.cdac.in/index.aspx?id=job_silchar_grb_oct-2021 వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. నిరుద్యోగులకు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.