మెడ వెనక నలుపు పోవాలంటే: ఆడవాళ్లు అందంగా కనిపించడానికి ఎన్నో రకాల సౌందర్య సాధనాలు ఉపయోగిస్తారు. ముఖం మీద ఏమైనా మచ్చలు ఉంటే రక రకాల ఉత్పత్తులని ఉపయోగించి వాటిని పోగొట్టడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో లో కొంతమంది ఆడవాళ్ళకి మెడ వెనక భాగం చాలా నల్లగా ఉంటుంది. నెక్ కాలర్ డ్రెస్సులు వేసే వాళ్లకి, పొడవైన జుట్టు ఉన్న వాళ్ళకి ఈ భాగం కనిపించదు కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ, ఎప్పుడైనా ట్ షర్టులు వేసుకోవాలన్నా, జుట్టుని ముడి వేసుకోవాలన్న ఈ నల్లటి మీద ఇబ్బంది పెడుతుంది.
కారణాలు: అసలు మెడ నల్లగా ఉండటానికి మూడు కారణాలు ఉంటాయి. వీటిలో మొదటిది, ముఖ్యమైనది మెడ భాగాన్ని సరిగ్గా శుభ్రంగా కడగక పోవడం. రెండవది… మధుమేహం, ఇతరత్రా వ్యాధులు ( థైరాయిడ్, ఊబకాయం లాంటి ), కొన్ని రకాల చర్మ వ్యాధుల వల్ల కూడా మెడ భాగం నల్లగా ఉంటుంది. మూడోది… కొన్ని సార్లు మందులు పడకపోవడం వల్ల కూడా నల్లగా ఉంటుంది.
నివారణలు: ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పూట మెడ భాగాన్ని శుభ్రం గా కడగాలి. అంతే కాకుండా కొన్ని రకమైన చిట్కాలు కూడా పాటించవచ్చు. శనగ పిండి ని స్నానం చేసేముందు మెడ భాగానికి బాత్ పౌడర్ లాగా వాడుకోవాలి. నల్లటి మచ్చలు ఉన్నచోట సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. అంతే కాకుండా కలబంద, కొబ్బరి నూనె లని రాసుకున్నా కూడా ప్రయోజనం ఉంటుంది.
బరువైన ఆభరణాలు ధరించడం కూడా మెడ నల్లబడటానికి ఒక కారణం. బరువు తగ్గటం వలన కొన్ని సార్లు మచ్చలు పోతాయి. అందువల్ల మెడ మీద మచ్చలు ఉన్నవారు బరువు తగ్గితే మంచిది.