Youtuber Anvesh: యూట్యూబ్ కు “నా అన్వేషణ” అన్వేష్ గుడ్ బాయ్!

నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఇటీవల అన్వేష్ బ్యాంకాక్ వెళ్ళాడు. అక్కడ జరిగే నూతన సంవత్సర వేడుకల దృశ్యాలను వీడియో తీసిన అన్వేష్.. తన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేశాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : January 14, 2024 9:19 am

Youtuber Anvesh

Follow us on

Youtuber Anvesh: నా అన్వేషణ” అన్వేష్.. యూట్యూబ్ లో ఇతడు ఒక సంచలనం. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఇతడు యూట్యూబ్లో ఎన్నో సంచలనాలు నమోదు చేశాడు. ముందు ఇండియాను మొత్తం తిరిగిన ఇతడు ఆ తర్వాత ప్రపంచాన్ని చుట్టి రావడం మొదలుపెట్టాడు. ఇప్పటికే అతను పలు దేశాలను చుట్టి వచ్చాడు. అనతి కాలంలోనే సెలబ్రిటీగా మారిపోయాడు. ఇటీవల నవీన్ పోలిశెట్టి నటించిన మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి అనే సినిమాకు ప్రమోషన్ లో భాగంగా అన్వేష్ ను వాడుకున్నాడూ అంటే అతడి చరిష్మాను అర్థం చేసుకోవచ్చు. చివరికి అన్వేష్ వాడిన ఆటగాడు అనే పదం, అతడి హావాభావాలు కూడా ట్రెండింగ్ లో కొనసాగుతున్నాయి. ఇటీవల ఈటీవీ జబర్దస్త్ లో కేవలం అన్వేష్ మీదనే నూకరాజు ఒక స్కిట్ రూపొందించాడు అంటేనే అతడి రేంజ్ అర్థం చేసుకోవచ్చు. కానీ అలాంటి పాపులారిటీ కలిగిన అన్వేష్ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు.

నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఇటీవల అన్వేష్ బ్యాంకాక్ వెళ్ళాడు. అక్కడ జరిగే నూతన సంవత్సర వేడుకల దృశ్యాలను వీడియో తీసిన అన్వేష్.. తన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేశాడు. ఆ తర్వాత అతడికి అంటే జనవరి 1 తెల్లవారుజామున 3 గంటలకు అమెరికా నుంచి ఓ యువతీ ఫోన్ చేసింది. ఆమె ఓ వ్య****. కుశల ప్రశ్నలు అడిగిన తర్వాత ఏం చేస్తున్నావని అన్వేష్ అడిగితే.. నేను నా బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ లో ఉన్నానని చెప్పింది. అదేంటి నువ్వు ఆ తరహా వృత్తి చేస్తుంటావు కదా? మధ్యలో ఈ బాయ్ ఫ్రెండ్ ఎందుకు అని అన్వేష్ అడిగాడు. ఆ వృత్తి అనేది నా సంపాదనకు సంబంధించింది. బాయ్ ఫ్రెండ్ అనేవాడు నా మనసుకు సంబంధించిన వాడు. నా మనసుకు నచ్చింది నేను చేయాలి, నేను మానసిక ఆనందం పొందాలి, అప్పుడే నా జీవితం పరిపూర్ణమైనట్టు లెక్క అని ఆ యువతీ చెప్పగానే అన్వేష్ లో నిజంగానే అన్వేషణ మొదలైందట.. ఇక అప్పటినుంచి కొద్ది రోజులపాటు అతడు పూర్తిగా అంతర్మథనంలోకి వెళ్లిపోయాడు. రెండు రోజులపాటు ఏడ్చాడట.. న్యూ ఇయర్ తర్వాత అన్వేష్ వీడియోలు చేయలేదు. ప్రస్తుతం అతడు కంబోడియాలో ఉన్నాడు. ఆ అమెరికా యువతి చెప్పిన తర్వాత తన ధోరణి మార్చుకున్నానని అన్వేష్ అంటున్నాడు. స్వయంగా పై విషయాలను అతడు ఒక వీడియో ద్వారా చెప్పాడు. ఇదే కాక ఇంకా పలు విషయాలను అతడు పంచుకున్నాడు.

తోటి యూట్యూబర్లతో తనకు ఇబ్బందిగా ఉందని, తనకు ఇప్పటివరకు 20 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నప్పటికీ యూట్యూబ్ నుంచి సిల్వర్ బటన్, గోల్డ్ బటన్ తీసుకోలేదని అన్వేష్ చెప్పాడు. తన సబ్స్క్రైబర్ లను ఏనాడూ మోసం చేయలేదని పేర్కొన్న అన్వేష్..బెట్టింగ్ యాప్ లు, ఇతర వాటిని తాను ప్రచారం చేయలేదని చెప్పాడు. ఇతర యూట్యూబర్లు లక్షల సొమ్ము కోసం అలాంటి యాప్ ల కోసం ప్రచారం చేశారని.. తాను మాత్రం అన్ని బాధ్యతతో ఉన్నాడని అన్వేష్ పేర్కొన్నారు. గతంలో తాను రాజకీయ పార్టీలపై చేసిన వీడియో కూడా ఇబ్బంది పెట్టిందని అన్వేష్ పేర్కొన్నాడు. ఆన్ని ప్రాంతాలు తిరిగి రావడం వల్ల, నాలుగు సంవత్సరాల పాటు పని రాక్షసుడి లాగా వివిధ దేశాలను చుట్టి రావడం వల్ల, కనీసం మూడు పూటల ఆహార కూడా తీసుకోలేకపోతున్నానని అన్వేష్ వాపోయాడు. ఈ కారణాల వల్ల తాను యూట్యూబ్ నుంచి కొంతకాలం పాటు వైదొలుగుతున్నానని అన్వేష్ పేర్కొన్నాడు. కాగా అన్వేష్ రూపొందించిన ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో చర్చనీయాంశంగా మారింది. అయితే చాలామంది నెటిజన్లు.. కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకో.. తర్వాత నీ పని నువ్వు తిరిగి ప్రారంభించు అని అతనికి సూచనలు ఇస్తున్నారు.