Homeక్రీడలుMS Dhoni: బలగమే ధోనీ బలం.. సక్సెస్‌ ఫార్ములా ఇదే!

MS Dhoni: బలగమే ధోనీ బలం.. సక్సెస్‌ ఫార్ములా ఇదే!

MS Dhoni: గెలపైనా.. ఓటమైనా ఒకేలా తీసుకునే సహనం.. కొత్త ఆటగాడైనా.. పాత ఆటగాడైనా… కలిసిపోయే తత్వం.. పరుగులు చేయకపోయినా.. అధికంగా పరులుగు ఇచ్చినా వెన్నుతట్టి ప్రోత్సహించే నాయకత్వ లక్షణం.. తెలిసింది చెప్పడం.. తెలియంది నేర్చుకునే గుణం.. ఎవరు ఏం చెప్పినా స్వీకరించే నైజం.. ఎక్కడ నెగ్గాలో.. ఎక్కడ తగ్గాలో తెలిసిన సారథ్యం.. ఇవన్నీ కలిస్తే ఒక ధోనీ. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక లక్షణాలు ధోనీని విజయవంతమైన క్రీడాకారుడిగా.. సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌గా అటు అంతర్జాతీయ క్రికెట్‌లో ఇటు ఐపీఎల్‌లో నిలబెట్టాయి. మిస్టర్‌ కూల్‌ అని ముద్దుగా పిలుచుకునే ఫ్యాన్స్‌ టీమ్స్‌కు అతీతంగా ధోనీకి ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

350 అంతర్జాతీయ మ్యాచ్‌లు.. 250 ఐపీఎల్‌ మ్యాచ్‌లు..
ధోనీ తన కెరీర్‌లో 350 అంతర్జాతీయ వన్డేలు ఆడాడు. సుమారు 200 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇక ఐపీఎల్‌లో 250 మ్యాచ్‌లు ఆడిన ధోనీ, 200 మ్యాచ్‌లకు సారథ్యం వహించాడు. ఎక్కడా వివాదానికి తావులేకుండా కెరీర్‌ను ముందుకు సాగిస్తున్న ఏకైక క్రికెటర్‌ బహుశా ధోనీ ఒక్కటే అనుకుంటా. ఓటమికి కుంగిపోకుండా.. గెలుపుకు పొంగిపోకుండా.. ఆటను ఆస్వాదించడమే ధోనీకి తెలుసు. ఆ నైజమే అంతర్జాతీయ వన్డే వరల్డ్‌కప్‌ సాధించేలా చేసింది. ఆ సారథ్య లక్షణమే ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టును ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపింది.

విమర్శలకు బ్యాట్‌తో సమాధానం..
ధోనీ ఆటగాడిగా అందరు క్రికెటర్లు ఎదుర్కొన్నట్లే విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. ఫామ్‌ కోల్పయినప్పుడు.. సిరీస్‌లో ఓటమి చవి చూసినప్పుడు క్రికెట్‌ అభిమానుల నుంచి విమర్శల వచ్చాయి. కానీ ధోనీ వాటిని ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదు. పాజిటివ్‌గా తీసుకుని బ్యాట్‌తో, విజయంతో సమాధానం చెప్పాడు. మీడియా ముందు అసహనం వ్యక్తం చేసిన సందర్భం కూడా ధోనీ కెరీర్‌లో కనిపించదు.

సీక్రెట్‌ అదే అని..
చెన్నై విజయానికి మెరికల్లాంటి ఆటగాళ్లను కొనుగోలు చేయడమే మా ట్రేడ్‌ సీక్రెట్‌ అని చెప్పిన ధోనీ చెబుతాడు. డ్రెస్సింగ్‌ రూంలో విఫలమైన ఆటగాళ్ల మూడ్‌ సరి చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న స్పోర్ట్స్‌ స్టాఫ్‌కు కూడా ఆ క్రెడిట్‌ దక్కుతుందని అన్నాడు. ఓటమైనా.. గెలుపైనా సమష్టిదని చెప్పడమే ధోనీ నైజం. ఒకరిద్దరిని బాధ్యులను చేసే మనస్తత్వం ధోనీది కాదు. ఇది కూడా జట్టు విజయ రహస్యంలో ఒకటి.

గొప్ప కెప్టెన్లలో ఒకడు..
ప్రపంచ క్రికెట్‌ చూసిన అతి గొప్ప కెప్టెన్లలో టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ ఒకడు. ఎంత ఒత్తిడిలో అయినా సరే చాలా కామ్‌గా కనిపించే ధోనీనీకి తన టీం మెంబర్స్‌తో చాలా మంచి అనుబంధం ఉంది. అతని కెప్టెన్సీలో ఎంతో మంది ఆటగాళ్లు భారత జట్టులో అరంగేట్రం చేసి సక్సెస్‌ చవిచూశారు. అలాంటి వారిలో స్టార్‌ ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ కూడా ఉన్నాడు. ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇంటర్వ్యూలో ధోనీ సక్సెస్‌ గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు. ‘ధోనీ నాకు ఈ విషయం చాలా సార్లు చెప్పాడు. కెప్టెన్‌గా నీ గట్‌ ఫీలింగ్‌ను బలంగా నమ్మాలి. ధోనీ కూడా అదే చేసేవాడు. కెప్టెన్‌గానే కాకుండా, వ్యక్తిగా కూడా ధోనీ ఇదే నమ్మేవాడు. మనకు ఏదైనా ఒక ఆలోచన వస్తే.. దాన్ని మనం చాలా రకాలుగా క్వశ్చన్‌ చేస్తాం. ధోనీ మాత్రం అలా చేయడు. ఏదైనా విషయం ఇలా జరుగుతుంది అనుకుంటే.. అదే చేస్తాడు. మరో ఆలోచన చేయడు’ అని రాహుల్‌ వెల్లడించాడు.

– ప్రశాంతతే సక్సెస్‌ మంత్రం..
మైదానంలో ప్రశాంతంగా ఉండడమే ధోనీ సక్సెస్‌ మంత్రం అని తెలిపాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ మైక్‌ హస్సీ. తను కూల్‌గా ఉంటూ జట్టును పరిగెత్తిండంలో ధోనీ దిట్ట అని అన్నాడు. ఆటగాళ్లకు 100 శాతం అండగా ఉంటూ జట్టును ముందుకు నడిపించే వ్యక్తి అని.. విజయం కోసం తనతో జట్టు మొత్తాన్ని పరుగెత్తిస్తాడు అని వెల్లడించాడు. ధోనీ అంతర్‌ దృష్టి చాలా గొప్పగా ఉంటుందని పేర్కొన్నాడు.

ఎంతో మంది జాతీయ, అంతర్జాతీయ క్రికెటర్లకు కూడా ధోనీ ఇష్టమైన క్రికెటర్‌. సారథులకు స్ఫూర్తి. తన ప్రశాంతతో జట్టును సమష్టిగా నడిపించడమే ధోనీ అసలైన విజయ రహస్యం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version