Homeజాతీయ వార్తలుKamareddy Case: తెలంగాణలో అసహాయుల మరణాలు.. స్పందించని కేసీఆర్ సర్కార్

Kamareddy Case: తెలంగాణలో అసహాయుల మరణాలు.. స్పందించని కేసీఆర్ సర్కార్

Kamareddy Suicide Case: తెలంగాణలో నాలుగు రోజుల క్రితం కామారెడ్డిలో జరిగిన తల్లీ కొడుకు గంగం సంతోష్, గంగం పద్మ సజీవ దహనం.. ఖమ్మంలో బీఎంఎస్‌ జిల్లా అధ్యక్షుడు సాయిగణేశ్‌ ఆత్మహత్యలు దేశవ్యాప్తంగా సంచలనమయ్యాయి. వరుస ఆత్మహత్యలకు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజాత్రినిధులు, వారి ప్రోద్బలంతో పోలీసులు పెట్టిన అక్రమ కేసులే కారణమని మృతులు తమ మరణ వాగ్మూలంలో స్పష్టంగా చెప్పారు. కానీ ఘటనలు జరిగి ఐదు రోజులు కావస్తున్నా.. సాయిగణేశ్‌ ఆత్మహత్యకు ప్రధాన కారకుడైన మంత్రి పువ్వాడ అజయ్, రామాయంపేటకు చెందిన తల్లీ కొడుకుల ఆత్మహత్యకు బాధ్యులైన మున్సిపల్‌ చైర్మన్, మార్కెట్‌ కమిటీ చైర్మన్, సీఐ నాగార్జునరెడ్డి ఇప్పటి వరకు నోరు విప్పడం లేదని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నారు. నాగార్జున రెడ్డిపై పోలీస్‌శాఖ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. పోలీసులపై వస్తున్న ఆరోపణలపై డీ.జీపీ మహేందర్‌రెడ్డి కూడా మౌనం పాటిస్తున్నారు. తప్పు చేశారు కనుకనే మంత్రి, డీజీపీ మౌనం వహిస్తున్నారన్న విమర్శలూ వినిపిస్తున్నాయి.

Kamareddy Suicide Case
Kamareddy Suicide Case

-పువ్వాడా.. మానవత్వం లేదా?
ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌ చాలా యువ మంత్రిగా పేరుతెచ్చుకున్నారు. కానీ వరుస వివాదాలు ఆయన ప్రతిష్ట మసకబారేలా చేస్తున్నాయి. చాలాకాలంగా ఖమ్మంలో మంత్రి అరాచకాలపై ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నేతలు ముందుకు తీసుకెళుతున్నారు. దీంతో ప్రతిపక్షాలపై ప్రతికారంతో రగిలిపోతున్న మంత్రివర్యులు ఇలా పోలీసులతో తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నాయి.ఇప్పటివరకూ మంత్రి ఈ విషయంలో స్పందించకపోవడంతో మౌనం అంగీకారమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: YS Vijayamma: వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి విజయమ్మ ఔట్.. పొమ్మనలేక పొగ పెట్టిన జగన్

తెలంగాణలో నాలుగు రోజుల క్రితం కామారెడ్డిలో జరిగిన తల్లీ కొడుకు గంగం సంతోష్, గంగం పద్మ సజీవ దహనం.. ఖమ్మంలో బీఎంఎస్‌ జిల్లా అధ్యక్షుడు సాయిగణేశ్‌ ఆత్మహత్యలు దేశవ్యాప్తంగా సంచలనమయ్యాయి. వరుస ఆత్మహత్యలకు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజాత్రినిధులు, వారి ప్రోద్బలంతో పోలీసులు పెట్టిన అక్రమ కేసులే కారణమని మృతులు తమ మరణ వాగ్మూలంలో స్పష్టంగా చెప్పారు. కానీ ఘటనలు జరిగి ఐదు రోజులు కావస్తున్నా.. సాయిగణేశ్‌ ఆత్మహత్యకు ప్రధాన కారకుడైన మంత్రి పువ్వాడ అజయ్, రామాయంపేటకు ఎందిన తల్లీ కొడుకుల ఆత్మహత్యకు బాధ్యులైన మున్సిపల్‌ చైర్మన్, మార్కెట్‌ కమిటీ చైర్మన్, సీఐ నాగార్జునరెడ్డి లపై ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వస్తున్నాయి.. పోలీసులపై వస్తున్న ఆరోపణలపై డీజీపీ మహేందర్‌రెడ్డి కూడా మౌనం పాటిస్తున్నారు. తప్పు చేశారు కనుకనే మంత్రి, డీజీపీ మౌనం వహిస్తున్నారన్న విమర్శలూ వినిపిస్తున్నాయి.

-పువ్వాడా.. మానవత్వం లేదా?
ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌ ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ తనను ఇబ్బంది పెట్టేవారిపై పోలీసులతో తప్పుడు కేసులు పెట్టిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్‌ కౌన్సిలర్, మరోమహిళా కౌన్సిలర్‌ భర్తపై కూడా మంత్రి ఆదేశాలతో ఖమ్మం పోలీసులు గతంలో పీడీయాక్టు కేసులు పెట్టారు. వారు జైలుకు వెళ్లొచ్చిన తర్వాత కూడా వేధింపులు ఆపడం లేదు.

– బీజేపీ అనుబంధ బీఎంఎస్‌ జిల్లా అధ్యక్షుడు సాయిగణేశ్‌పై ఏడాది వ్యవధిలో 18 కేసులు పెట్టారు. రౌడీషీట్‌ కూడా ఓపెన్‌ చేయించారు. కేసులను ధైర్యంగా ఎదుర్కొటూ వచ్చిన సాయిగణేశ్‌ రౌడీషీట్‌ ఓపెన్‌ చేయడంతో మనస్తాపం చెందాడు. మంత్రి ఆదేశాలతో ఇప్పటికే తనపై తప్పుడు కేసులు పెట్టారని, రౌడీషీట్‌ ఓపెన్‌ చేయడం సరికాదని ఖమ్మం ఠాణాకు వెళ్లి పోలీసులను కోరారు. అయినా పోలీసుల నుంచి సమాధానం రాకపోవడంతో మనస్తాపం చెందాడు. బయటకు వచ్చి స్టేషన్ ఎదుటే పురుగుల మందు తాగాడు. చికిత్స పొందుతూ మూడు రోజుల తర్వాత మృతిచెందాడు.

-పోలీసుల అత్యుత్సాహం..
సాయిగణేశ్‌ మృతదేహానికి పోస్టుమార్టం చేయిండం.. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడంలో ఖమ్మం పోలీసులు మరోసారి అత్యుత్సాహం ప్రదర్శించారు. మంత్రి ఆదేశాల మేరకు ఇక్కడా నడుచుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సాయి మృతితో పట్టణంలో బీజేపీ నాయకులు ఆందోళనలు చేసిన నేపథ్యంలో మంత్రి పువ్వాడ దిశానిర్దేశంలో పోస్టుమార్టం ఆలస్యం చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించకుండా నేరుగా శ్మశానవాటికకు తరలించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదేంటని అడిగితే శాంతిభద్రతల సమస్య అంటూ దాటవేశారు. రౌడీ ఆత్మహత్య చేసుకుంటే ప్రజలు సంబరాలు చేసుకుంటారు.. కానీ సాయిగణేశ్ కోసం ఖమ్మం కన్నీరు పెట్టింది. అయినా మంత్రి పువ్వాడ అజయ్‌లో మాత్రం మానవత్వం చిగురించడం లేదన్న ఆవేదన అక్కడి వారిలో ఉంది. సాయి ఆత్మహత్యతో ఆయన అమ్మమ్మ, చెల్లి ఒంటరయ్యారు. ఘటన జరిగి వారం కావస్తున్నా.. ఇందుకు తాను బాధ్యుడిని కాదని ధైర్యంగా ప్రకటించలేని పరిస్థితిలో ఉన్నారు టీఆర్ఎస్ నేతలు.. బాధిత కుటుంబానికి ధైర్యం కూడా చెప్పే ప్రయత్నం చేయడం లేదు. ఖమ్మంలోనే ఉంటున్నా.. మంత్రి నోరు విప్పకపోవడంపై ప్రజలు, విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గులాబీ బాస్‌ కూడా ఈ దారుణాలపై ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

-సీఐ నాగార్జునగౌడ్‌ ఎక్కడ?
రామాయంపేటకు చెందిన తల్లీకొడుకులు గంగం పద్మ, సంతోష్‌ ఆత్మహత్యకు కారకుడైన సీఐ నాగార్జునగౌడ్‌ ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. బాధితులు తమ మరణ వాగ్మూలంలో స్పష్టంగా సీఐ పేరు చెప్పినా పోలీస్‌ శాఖ కూడా ఆయనపై చర్య తీసుకోలేదు. సీఐ కోసం గాలింపు కూడా చేపట్టలేదు. రామాయంపేట ఘటనపై డీఎస్పీని ప్రత్యేక విచారణ అధికారిగా పోలీసులు నియమించి చేతులు దులుపుకున్నారు. కానీ పోలీసులు నిందితుల కోసం గాలించలేదు. ఎందుకంటే ఆరుగురు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, మరొకరు పోలీస్‌ శాఖకే చెందిన నాగార్జునగౌడ్‌ కావడంమే. సీఐపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైనా.. పోలీసులు ఇప్పటికీ నోటీసులు ఇవ్వకపోవడం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆరుగురు నిందితులు మంగళవారం రాత్రి కామారెడ్డి పోలీసులకు లొంగిపోయారు. బుధవారం వారిని కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు. నాగార్జునగౌడ్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పడం గమనార్హం.

Kamareddy Suicide Case
Kamareddy Suicide Case

 

-రాజకీయ ఒత్తిడితోనే..
తల్లీ కొడుకుల ఆత్మహత్యకు రాజకీయ నాయకుల ఒత్తిడి కారణమని.. బాధ్యుడైన సీఐ నాగార్జునగౌడ్, తాజాగా కేసు నుంచి తప్పించుకునేందుకు మళ్లీ అదే రాజకీయ పలుకుబడి ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ నేతల ఒత్తిడితోనే సీఐ తుంగతుర్తిలో ప్రస్తుతం విధులకు హాజరవుతున్నా.. నోటీసులు ఇవ్వడంలేదు. విచారణకు పిలువడం లేదు. అరెస్ట్‌కు వెనుకాడుతున్నారన్న ఆరపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు స్వయంగా లొంగిపోయిన ఆరుగురికి కూడా పోలీసులు రాచమర్యాదలు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ అండతో రామాయంపేట కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేంద్రం రంగంలోకి దిగి సీబీఐతో విచారణ జరిపితేనే బాధితులకు న్యాయం జరుగుతుందని, స్థానిక పోలీసులు కేసును నీరుగారుస్తున్నారని బీజేపీ నాయకులు గవర్నర్‌ తమిళిసైకి కూడా విన్నవించారు.

-డీజీపీ మౌనం?
వరుస ఆత్మహత్యల వెనుక పోలీసులు ఉన్నట్లు మృతులు తమ మరణ వాగ్మూలంలో స్పష్టంగా పేర్కొన్నారు. సీఐ నాగార్జునగౌడ్, ఖమ్మం పోలీసుల తప్పుడు కేసులే కారణమని బహిరంగ రహస్యమే. అయినా పోలీస్‌ బీస్‌ డీజీపీ మహేందర్‌రెడ్డి మాత్రం ఇప్పటి వరకు తమ శాఖపై వస్తున్న ఆరోపణలను ఖండించడం లేదు. కానీ అధికార పార్టీ ఆదేశాలతో తమ శాఖవారిని తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఘటనలపై రాష్ట్ర పోలీసులతో విచారణ చేస్తే న్యాయం జరుగదని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు. ఏదైనా ఆరోపణ వస్తే పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీయొద్దని, తప్పుడు ప్రచారం చేయొద్దని ప్రెస్‌మీట్, ప్రెస్‌నోట్‌ విడుదల చేసే పోలీస బాస్‌ మౌనం వెనుక ఆంతర్యం ఏమిటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

తెలంగాణ ప్రభుత్వంలో ఇలా ఘోరాలు, దారుణాలు జరుగుతున్నా వారికి బాధ్యులైన టీఆర్ఎస్ నేతలూ.. పోలీసులపై నామ మాత్రపు చర్యలు.. కొన్ని చర్యలే లేకపోవడంపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికైనా బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

Also Read:Nellore Politics: నెల్లూరి వైసీపీలో ఆగని రచ్చ.. సీఎం జగన్ జోక్యం చేసుకున్నా ఫలితం శూన్యం

Recommended Videos:

Ram Charan Emotional Words About Mega Star Chiranjeevi || Oktelugu Entertainment

Pawan Kalyan Fans Fear on Hari Hara Veeramallu Movie || Director Krish || Oktelugu Entertainment

Vijay Devarakonda Samantha Lip Lock Scenes || Shiva Nirvana || Oktelugu Entertainment

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

3 COMMENTS

  1. […] Minister Roja: మోచేతిలో బలముంటే మొండికొడవలైనా తెగుతుంది. అధికారంలో ఉంటే ఎంత పని అయినా సువులుగా అయిపోతోంది సామాన్యుడి రూ.10 లక్షలు పోయినా పట్టించుకోరు కానీ మంత్రి గారి ఫోన్ పోయిందంటే నానా హంగామా చేశారు. పదివేల ఫోన్ కోసం పోలీసులు నానా రభస చేశారు. మూడు టీంలుగా ఏర్పడి మరీ మంత్రి గారి దగ్గర మార్కులు కొట్టేశారు. తామున్నది మీ సేవకే అంటూ తలూపారు. సెల్ ఫోన్ దొరికేదాకా టెన్షన్ పడ్డారు.దీంతో పోలీస్ ఉన్నతాధికారుల హడావిడి చూస్తుంటే అందరికి ఆశ్చర్యం వేసింది. అధికారమా మజానా అని అందరు నోరెళ్లబెట్టారు ఈ సినిమా అంతా తిరుపతిలో చోటుచేసుకుంద ఇటీవల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజా తిరుపతిలో పర్యటనకు వచ్చిన సందర్భంగా నడిచిన హైడ్రామా ఇది […]

  2. […] CM Jagan Early Elections: జగన్ సర్కారు సంక్షేమ భారాన్ని మోయలేకుందా? పథకాల అమలుకు ఎక్కడా అప్పు పుట్టే పరిస్థితి కనిపించడం లేదా? ఎమ్మెల్యేలపై విపరీతమైన వ్యతిరేకత పెరిగిందా? ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం సడలిందా? పార్టీలో అంతర్గత విభేదాలు కలవరపెడుతున్నా? ప్రజల విశ్వసాన్ని మరోసారి పొందాలంటే ముందస్తు ఎన్నికలే శరణ్యమా?..అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే సమాధానం వినిపిస్తున్నాయి. సీఎం జగన్ వరుసగా తీసుకుంటున్న నిర్ణయాలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. 2019 ఎన్నికల్లో 151 స్థానాలతో వైసీపీ గెలుపొందింది. జగన్ అంతులేని విజయంతో దాదాపు క్లీన్ స్వీప్ చేశారు. విపక్షాలు దరిదాపులకు రానీయకుండా ఊర్చిపారేశారు. […]

Comments are closed.

Exit mobile version