https://oktelugu.com/

Naga Chaitanya Samantha:నాగ చైతన్య ని మర్చిపోలేకపోతున్న సమంత.. వైరల్ అవుతున్న లేటెస్ట్ పోస్ట్

Naga Chaitanya Samantha: సౌత్ ఇండియా లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన జంటలలో ఒక్కటి సమంత మరియు నాగ చైతన్య జంట..వీళ్లిద్దరు విడిపోయారు అని వార్త తెలియగానే వీళ్ళ అభిమానులు ఎంతలా అయితే బాదపడ్డారో..ఈ జంట ని అభిమానించే సగటు ప్రేక్షకులు కూడా అంతే బాధ పడ్డారు..ఏ మాయ చేసావే అనే సినిమాతో ప్రారంభం అయిన వీళ్లిద్దరి ప్రయాణం పెళ్లి దాకా చేరింది..అంత సజావుగా సాగిపోతుంది అని అనుకుంటున్న సమయం లో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 21, 2022 / 12:56 PM IST
    Follow us on

    Naga Chaitanya Samantha: సౌత్ ఇండియా లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన జంటలలో ఒక్కటి సమంత మరియు నాగ చైతన్య జంట..వీళ్లిద్దరు విడిపోయారు అని వార్త తెలియగానే వీళ్ళ అభిమానులు ఎంతలా అయితే బాదపడ్డారో..ఈ జంట ని అభిమానించే సగటు ప్రేక్షకులు కూడా అంతే బాధ పడ్డారు..ఏ మాయ చేసావే అనే సినిమాతో ప్రారంభం అయిన వీళ్లిద్దరి ప్రయాణం పెళ్లి దాకా చేరింది..అంత సజావుగా సాగిపోతుంది అని అనుకుంటున్న సమయం లో వీళ్లిద్దరి మధ్య ఏర్పడిన కొన్ని విభేదాల కారణంగా విడిపోవడం బాధాకరం..వీళ్లిద్దరు తీసుకున్న విడాకుల నిర్ణయం ని అటు అక్కినేని కుటుంబం ఇటు సమంత కుటుంబం వెనక్కి తీసుకునేలా ఎన్ని ప్రయత్నాలు చేసినా వీళ్ళు చివరికి విడాకులు తీసుకోవాలి అనే నిర్ణయం పై దృడంగా నిలబడడం తో పెద్దవాళ్ళు కూడా ఏమి చెయ్యలేక పొయ్యారు..అలా ఈ అందమైన జంట విడిపోయాయి 8 నెలలు దాటేసింది..ఇద్దరు ఒక్కరిని ఒక్కరు మర్చిపొయ్యి ఎవరి కెరీర్ లో వాళ్ళు ఫుల్ బిజీ గా గడుపుతున్నారు.

    Naga Chaitanya, Samantha

    ఇది ఇలా ఉండగా ఇటీవల సమంత తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పెట్టిన ఒక్క పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ గా మారింది..అసలు విషయానికి వస్తే సమంత మరియు నాగ చైతన్య ప్రేమ లో ఉన్న సమయం లో ఇరువురి చేతులకు గుర్తుగా ఒక్క టాటూ ని వేయించుకున్నారు..ఈ టాటూ వాళ్ళ ప్రేమకి చిహ్నంగా ఉంటుంది అని ఈ ఇద్దరు పలు ఇంటర్వూస్ లో కూడా తెలిపిన సంగతి మన అందరికి తెలిసిందే..ఇప్పుడు సమంత తన ఇంస్టాగ్రామ్ లో ఆ టాటూ కనిపించే విధంగా ఫోటోలు అప్లోడ్ చెయ్యడం చూస్తూ ఉంటె ఆమె నాగ చైతన్య ని ఇప్పటికి మర్చిపోలేకపోతుంది అని ఆమె అభిమానులు ఆ పోస్ట్ కింద కామెంట్లు పెడుతున్నారు..ఈ కామెంట్స్ పై సమంత ఎలాంటి రియాక్షన్ లేదు..ఇటీవలే అక్కినేని అఖిల్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేసిన సమంత , నాగ చైతన్య పుట్టిన రోజు కి మాత్రం సోషల్ మీడియా లో ఎలాంటి విషెస్ చెప్పలేదు..దీనిని బట్టి చూస్తూ ఉంటె ఆమె నాగ చైతన్య మీద బాగా కోపం గా ఉన్నట్టు అర్థం అవుతుంది.

    Also Read: BJP Focused On Khammam: ఆపరేషన్‌ కమలం: ఖమ్మంపై కాషాయ పార్టీ దృష్టి.. కేంద్ర మంత్రులు.. జాతీయ నేతల రాక

    ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సమంత చేతినిండా సినిమాలు మరియు వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీ గా గడుపుతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ముఖ్యంగా ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమాల పైన ఎక్కువ ఆసక్తిని చూపుతుంది..ప్రస్తుతం ఆమె యశోద మరియు శాకుంతలం అనే రెండు భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది..ఈ రెండు సినిమాల షూటింగ్స్ ఇటీవలే ప్రారంభం కూడా అయ్యాయి..వీటితో పాటు ఆమె హాలీవుడ్ లో ఒక్క సినిమా కూడా చేయబోతుంది..అలాగే త్వరలో తెలుగు లో విజయ్ దేవరకొండ సినిమాలో హీరోయిన్ గా కూడా నటించబోతుంది సమంత..మరో పక్క నాగ్ చైతన్య కూడా కెరీర్ పరంగా వరుస విజయాలతో పీక్స్ ని ఎంజాయ్ చేస్తున్నాడు..మజిలీ , వెంకీ మామ, లవ్ స్టోరీ మరియు బంగార్రాజు వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో యూత్ లో మంచి క్రేజ్ దక్కించుకున్న నాగ చైతన్య అమిర్ ఖాన్ హీరో గా నటించిన లాల్ సింగ్ చద్దా అనే సినిమాలో ముఖ్య పాత్ర పోషించి బాలీవుడ్ డెబ్యూ కూడా చెయ్యబోతున్నాడు..ఇక తెలుగు లో ప్రస్తుతం ఆయన మనం సినిమా దర్శకుడు విక్రమ్ కె కుమార్ తో థాంక్యూ అనే సినిమా చేస్తున్నాడు.

    Also Read: Suma: ఆ షోలో సుమ బండారం బయటపెట్టిన రచ్చరవి.. ఏకంగా బూతులు తిడుతూ?

    Recommended Videos:

    Tags