PM Modi – James Marape : ప్రధాని మోదీకి అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఫోరమ్ ఫర్ ఇండియా పసిఫిక్ ఐల్యాండ్స్ కార్పొరేషన్ మూడో సదస్సులో పాల్గొనడానికి పపువా న్యూగినియా దేశానికి వెళ్లారు. ఆ దేశానికి వెళ్లిన తొలి భారత ప్రధాని మోదీయే కావడం గమనార్హం. అయితే మోదీపై ఉన్న అభిమానంతో తమ దేశ సంప్రదాయాలను బ్రేక్ చేస్తూ కనీవినీ ఎరుగని రీతిలో స్వాగత ఏర్పాట్లు చేయడం విశేషం. ప్రత్యేక విమానంలో దేశానికి చేరుకున్న ప్రధాని మోదీకి దేశ ప్రధానికి జేమ్స్ మరాపే స్వాగతం పలికారు. ప్రధాని మోదీ పాదాలకు నమస్కారం చేసి ఆత్మీయతను చాటుకున్నారు. ఊహించని ఈ పరిణామంతో ప్రధాని మోదీ భావోద్వేగానికి గురయ్యారు.
జపాన్ లో జీ7 సదస్సలో పాల్గొన్న ప్రధాని మోదీ తరువాత ద్వీప దేశం పపువా న్యూగినియా. ప్రపంచాన్ని వణికించి కొవిడ్ తో ఈ దేశం కూడా అల్లాడిపోయింది. తీవ్ర ఆరోగ్య సంక్షోభాన్ని చవిచూసింది. ఆ సమయంలో భారతదేశం ఇతోధికంగా సాయమందించింది. కొవిడ్ 19 వ్యాక్సిన్లను భారీగా పంపించింది. గ్లోబల్ వ్యాక్సిన్లు అందక ఇబ్బందులు పడుతున్న సమయంలో భారత్ ఆపన్న హస్తం అందించింది. అప్పటి నుంచి పపువా న్యూగినియా భారతదేశాన్ని ఆరాధిస్తోంది. గౌరవభావంతో చూస్తోంది. అందుకే ప్రధాని మోదీకి ఆ దేశంలో ఆత్మీయ స్వాగతం లభించింది. ఆదేశ ప్రధాని పాదాభివందనం చేసి తనలో ఉన్న గౌరవభావాన్ని చాటుకున్నారు.
పపువా న్యూగినియా దేశానికి ఒక సంప్రదాయం ఉంది. సాధారణంగా సూర్యాస్తమయం తర్వాత ఏ దేశం నుంచి వచ్చి నాయకుడికైనా స్వాగత ఉత్సవాన్ని నిర్వహించదు. కానీ భారత ప్రధాని మోదీ కోసం ఆ సంప్రదాయాన్ని ఆ దేశం పక్కనపెట్టింది. రాత్రి 10 గంటల తర్వాత మోదీ.. పపువా న్యూ గినియాలో అడుగుపెట్టారు. మోదీకి స్వాగత ఉత్సవాన్ని ఆ దేశం నిర్వహించింది. ఈ సందర్భంగానే పపువా న్యూగినియా ప్రధాని జేమ్స్ మరాపే.. మోదీ కాళ్లకు మొక్కారు. ఆయనను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు నరేంద్ర మోదీ.19-గన్ సెల్యూట్, గార్డ్ ఆఫ్ హానర్, స్వాగత ఉత్సవంతో మోదీకి పపువా న్యూ గినియాలో ఘన స్వాగతం దక్కింది. ఫోరమ్ ఫర్ ఇండియా-పసిఫిక్ ఐల్యాండ్స్ కోఆపరేషన్ సదస్సు సోమవారం జరగనుంది. ఆ దేశ ప్రధాని జేమ్స్ మరాపే, గవర్నర్ జనరల్ బోబ్ దడేయీతో మోదీ భేటీ కానున్నారు. 14 పసిఫిక్ దేశాల నేతలు ఈ సదస్సులో పాల్గొంటారు.
అయితే ప్రధాని మోదీ పాదాలు తాకిని ఆ దేశ ప్రధాని జేమ్స్ మరాపేకు చిన్నాచితకా నాయకుడు కాదు. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది. 2019 నుంచి దేశ ప్రధానిగా ఉన్నారు. జేమ్స్ మరాపే 1993లో యూనివర్శిటీ ఆఫ్ పాపువా న్యూ గినియా నుంచి ఆర్ట్స్‌లో బ్యాచిలర్ పట్టభద్రుడయ్యాడు. ఎన్విరాన్మెంటల్ సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆనర్స్ మరియు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీని కూడా పొందాడు. ఆదేశానికి అతడు 8వ ప్రధాని. అంతుకు ముందున్న ప్రభుత్వాల్లో మంత్రి పదవులు నిర్వర్తించారు. పార్లమెంటరీ కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఇతర దేశాలతో దైపాక్షిక సంబంధాల్లో కీలక భూమిక పోషించాడు. 2019లో పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, పంగు పార్టీలో చేరారు. దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు. ప్రధాని మోదీతో సత్సంబంధాలు నడిపి.. కొవిడ్ విపత్తు సమయంలో భారత్ సాయం పొందగలిగారు. తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించగలిగారు. అందుకే పాదాభివందనం చేసి రుణం తీర్చుకున్నారు. భారత్ అభివృద్ధిని మోదీ చాటిచెబుతున్నారనడానికి ఈ ఘటన ఒక మచ్చుతునక అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ట్విట్టర్ లో ఆనందం వ్యక్తం చేశారు.
#WATCH | Prime Minister of Papua New Guinea James Marape seeks blessings of Prime Minister Narendra Modi upon latter’s arrival in Papua New Guinea. pic.twitter.com/gteYoE9QOm
— ANI (@ANI) May 21, 2023
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Modi receives warm welcome in papua new guinea pm marape touches his feet
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com