Dacoit Teaser Review: ‘సరికొత్త థ్రిల్లర్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తూ ఆడియన్స్ లో తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న అడవి శేష్(adivi Sesh), 2022 వ సంవత్సరం లో విడుదలైన ‘హిట్ : ది సెకండ్ కేస్’ చిత్రం తర్వాత భారీ గ్యాప్ ఇచ్చాడు. ‘గూఢచారి 2’ చిత్రాన్ని గ్రాండ్ స్కేల్ లో మొదలు పెట్టాడు, ఆ తర్వాత కొన్నాళ్ళకు ‘డెకాయిట్'(Dacoit Movie) అనే చిత్రాన్ని కూడా ప్రకటించాడు. శృతి హాసన్ ఇందులో హీరోయిన్ గా ఎంపికైంది. అయితే కొంతకాలం ఆమెతో షూటింగ్ చేసిన తర్వాత డేట్స్ సమస్య తలెత్తడం తో, ఆమెని ఆ చిత్రం నుండి తప్పించి మృణాల్ ఠాకూర్ ని హీరోయిన్ గా తీసుకున్నారు. మళ్లీ రీ షూటింగ్ చేసి ఇప్పుడు దాదాపుగా చివరి దశకు తీసుకొచ్చారు. కొద్దినెలల క్రితం ఈ సినిమా కి సంబంధించిన గ్లింప్స్ వీడియో ని విడుదల చేయగా, దానికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
అడవి శేష్ మరోసారి సరికొత్త ప్రయోగం తో మన ముందుకు రాబోతున్నాడు అని అంతా అనుకున్నారు. ఇక నేడు విడుదల చేసిన టీజర్ ని చూసిన తర్వాత కచ్చితంగా అడవి శేష్ మరోసారి సిక్సర్ కొట్టబోతున్నాడు అనేది స్పష్టంగా ఆడియన్స్ కి అర్థం అయిపోయింది. ఈ టీజర్ చూసిన తర్వాత మూవీ స్టోరీ పై ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. హీరో ఒక క్రిమినల్, సుపారీ తీసుకొని కిడ్నాప్స్ వంటివి చేస్తూ ఉంటాడు. అలా ఆయనకు హీరోయిన్ ని కిడ్నాప్ చేయమని సుపారీ వస్తుంది. కిడ్నాప్ చేస్తాడు, ఆ తర్వాత జరిగే పరిణామాల కారణంగా హీరోయిన్ కి రక్షణ గా నిలబడతాడు, ఆమెతో ప్రేమలో కూడా పడుతాడు. అసలు హీరోయిన్ ని ఎందుకు కిడ్నాప్ చేయాలనీ అనుకుంటున్నారు?, ఆమె కోసం రెండు గ్యాంగ్స్ ఎందుకు కొట్టుకుంటున్నాయి అనేదే స్టోరీ.
కథ కాస్త రొటీన్ గానే అనిపించొచ్చు, కానీ స్క్రీన్ ప్లే ని నడిపించే విధానం చాలా కొత్తగా ఉంటుంది. అంతే కాదు ఈ సినిమాలో రెండు మూడు బ్లాక్స్ లో వచ్చే ట్విస్టులు చూస్తే ఆడియన్స్ కి మైండ్ బ్లాక్ అయ్యేంత పని అవుతుందట. అలా చాలా డిఫరెంట్ ప్రయత్నం గా ఈ సినిమాని తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది. యాక్షన్ సన్నివేశాలు, చేసింగ్ సన్నివేశాలు ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయట. ఇకపోతే ఈ టీజర్ లో అక్కినేని నాగార్జున హలో బ్రదర్ చిత్రం లోని ‘కన్నెపెట్టరో..కన్ను కొట్టెరో’ పాటని బ్యాక్ గ్రౌండ్ గా ఉపయోగించారు. టీజర్ చివర్లో విలన్ కూడా ఆ పాట ని హమ్మింగ్ చేయడం హైలైట్ గా అనిపించింది. ఓవరాల్ గా అడవి శేష్ మార్క్ సినిమాగానే ఈ చిత్రం అనిపించింది. ఆడియన్స్ కి ఎలా కనెక్ట్ అవుతుందో చూడాలి.