NTR Devara: #RRR వంటి సెన్సేషన్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా కొరటాల శివ దర్శకత్వం లో ‘దేవర’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ రీసెంట్ గానే విడుదల అవ్వగా, దానికి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, కానీ మామూలు ఆడియన్స్ నుండి మాత్రం యావరేజి రెస్పాన్స్ వచ్చింది.
టైటిల్ ఉన్నంత మాస్ గా ఫస్ట్ లుక్ పోస్టర్ లేదని చాలా మంది అభిప్రాయం.స్టోరీ కూడా రొటీన్ అవ్వడం తో అసలే డిజాస్టర్ ఫ్లాప్ లో ఉన్న కొరటాల శివ ఎన్టీఆర్ కి ఎలాంటి సినిమా ఇస్తున్నాడా అని ఫ్యాన్స్ లో కూడా ఎదో ఒక మూల చిన్న భయం ఉంది. ఇందుకోసం భారీ బడ్జెట్ తో పాటుగా హాలీవుడ్ టెక్నిషియన్స్ ని కూడా దింపాడు కొరటాల శివ.
మొదటి షెడ్యూల్ ని రీసెంట్ గానే పూర్తి చేసారు, రెండవ షెడ్యూల్ కూడా త్వరలోనే ప్రారంభం అవ్వబోతుంది. అయితే రీసెంట్ గానే మొదటి షెడ్యూల్ కి సంబంధించిన ఔట్పుట్ ని చూసిన తర్వాత ఎన్టీఆర్ ఎందుకో సంతృప్తి గా లేదని ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్. కెమెరా మ్యాన్ మరియు కొరటాల శివ మీద ఈ విషయం పై ఎన్టీఆర్ ఫైర్ అయ్యినట్టు సమాచారం.
కానీ సినిమాటోగ్రాఫర్ మాత్రం తన పని పెర్ఫెక్టు గానే ఉందని, మరో సారి తన మీద ఇలా కోపం తెచ్చుకుంటే ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటాను అని కొరటాల శివ తో అన్నాడట. ప్రస్తుతం ఈ వార్త ఫిలిం నగర్ లో తెగ షికారు చేస్తుంది. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తుండగా , జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 4 వ తేదీన ఈ చిత్రం విడుదల కాబోతున్నట్టు సమాచారం.