కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కార్మికులకు అదిరిపోయే శుభవార్త చెప్పడానికి సిద్ధమవుతుందని తెలుస్తోంది. కేంద్రం కొత్త కార్మిక చట్టాలను అమలులోకి తీసుకురానున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. కొత్త కార్మిక చట్టాలు అమలులోకి వస్తే మాత్రం ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. సాధారణంగా ఉద్యోగులు రోజుకు 8 గంటలు పని చేసే అవకాశం ఉండగా కొత్త కార్మిక చట్టాలు అమలులోకి వస్తే రోజుకు ఉద్యోగులు 12 గంటలు పని చేయాల్సి ఉంటుంది.
Also Read: ఓటర్ స్లిప్ లేదా.. డిజిటల్ ఓటర్ ఐడీ ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలంటే..?
అయితే వారానికి నాలుగు రోజులు పనిదినాలుగా ఉండగా మిగిలిన మూడు రోజులు సెలవు దినాలుగా ఉంటాయి. కొత్త కార్మిక చట్టాల ప్రకారం ఉద్యోగులకు ఫ్రీ మెడికల్ చెకప్స్ కూడా ఉంటాయని సమాచారం. అయితే కేంద్రం కంపెనీలు, ఉద్యోగులు ఇష్టపడితే మాత్రమే ఈ విధంగా నాలుగు రోజులు 12 గంటల పాటు పని చేసే అవకాశం కల్పిస్తుంది. ఉద్యోగులు ఒత్తిడిగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటే మాత్రం ఇష్టం వచ్చిన ఆప్షన్ ను ఎంచుకోవచ్చు.
Also Read: ఆ ఖాతాకు ఆధార్ లింక్ చేయలేదా.. 2.30 లక్షలు నష్టపోయే ఛాన్స్..?
కంపెనీలు ఎటువంటి ప్రత్యేక అనుమతులు తీసుకోకుండానే కేంద్రం కొత్త కార్మిక చట్టాలను అమలు చేయడానికి సిద్ధమవుతోందని తెలుస్తోంది. అయితే ఈ నిబంధనలు ఎప్పటినుంచి అమలులోకి వస్తాయనే సంగతి తెలియాల్సి ఉంది. కొత్త నిబంధనలు అమలులోకి వస్తే కంపెనీల కంటే ఉద్యోగులకు ఎక్కువ ప్రయోజనం చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారులు అతి త్వరలోనే ఈ నిబంధనలను అమలులోకి తెస్తామని చెబుతున్నారు.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
ఈ నిర్ణయంపై కంపెనీలు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటాయో చూడాల్సి ఉంది. ఇప్పటికే పలు దేశాల్లో ఈ తరహా చట్టాలు అమలులో ఉన్నాయి. కొత్త కార్మిక చట్టాల నిబంధనలపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.