https://oktelugu.com/

నాగబాబును నమ్ముకుని రోడ్డున పడ్డారా.. చమ్మక్ చంద్ర స్పందన !

“జబర్దస్త్” అనే కామెడీ షో వల్ల చాలమంది జీవితాలు మారిపోయాయి. జడ్జీలుగా నాగబాబు, రోజాలకు ఈ షో చాల ఉపయోగపడింది. ముఖ్యంగా ఆర్థిక కష్టాలలో కూరుకుపోయిన నాగబాబు ఏళ్ల తరబడి జబర్ధస్త్ జడ్జిగా చేసి, మళ్ళీ ఆర్ధికంగా నిలబడ్డాడు. అలాగే నవ్వుల బాబుగా కూడా ఫేమస్ అయ్యాడు అనుకోండి. దీనికితోడు కొడుకు హీరోగా నిలదొక్కుకొని కోట్లు తీసుకొనే హీరోగా ఎదిగిన తర్వాత, జబర్ధస్త్ నిర్మాతలపై అవాకులు చవాకులు పేల్చి… బయటి వచ్చేశాడు. జీ తెలుగులో సొంతగా అదిరింది, […]

Written By:
  • admin
  • , Updated On : February 9, 2021 / 02:42 PM IST
    Follow us on


    “జబర్దస్త్” అనే కామెడీ షో వల్ల చాలమంది జీవితాలు మారిపోయాయి. జడ్జీలుగా నాగబాబు, రోజాలకు ఈ షో చాల ఉపయోగపడింది. ముఖ్యంగా ఆర్థిక కష్టాలలో కూరుకుపోయిన నాగబాబు ఏళ్ల తరబడి జబర్ధస్త్ జడ్జిగా చేసి, మళ్ళీ ఆర్ధికంగా నిలబడ్డాడు. అలాగే నవ్వుల బాబుగా కూడా ఫేమస్ అయ్యాడు అనుకోండి. దీనికితోడు కొడుకు హీరోగా నిలదొక్కుకొని కోట్లు తీసుకొనే హీరోగా ఎదిగిన తర్వాత, జబర్ధస్త్ నిర్మాతలపై అవాకులు చవాకులు పేల్చి… బయటి వచ్చేశాడు. జీ తెలుగులో సొంతగా అదిరింది, బొమ్మ అదిరింది అనే కామెడీ షోలను మొదలుపెట్టి సహా నిర్మాతగానూ మారాడు.

    Also Read: పిల్లల కోసం రామ్ అనూహ్య నిర్ణయం.. ఆనందంలో సునీత !

    అయితే “జబర్దస్త్” నుండి నాగబాబు వెళుతూ వెళుతూ చమ్మక్ చంద్ర, ఆర్పీ వంటి కొందరు కమెడియన్స్ ని తనతో పాటు తీసుకుపోయాడు. కాగా భారీ హంగామా మధ్య మొదలైన అదిరింది షోకు ఊహించిన రెస్పాన్స్ రాకపోగా బ్యాడ్ టాక్ వచ్చింది. కొన్ని వారాల పాటు సాగతీసినా, బాగా ప్రమోషన్స్ చేసినా ఎందుకో షో నిలబడలేకపోయింది. మొదట సమీరాను యాంకర్‌గా ఈ షో మొదలైంది. ఆ తర్వాత యాంకర్ రవి, భాను శ్రీలను తీసుకువచ్చారు. అదీ వర్కౌట్ అవ్వలేదు. జబర్దస్త్‌కు పోటీగా రావడంతో అంచనాలు కూడా భారీ స్థాయిలో ఉండటం పెద్ద దెబ్బ కొట్టింది.

    Also Read: భర్తతో విడాకులు.. వ్యభిచారిణి పాత్రలో హీరోయిన్ !

    దీనికితోడు జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన వేణు, ధన్‌రాజ్ లాంటి వాళ్లు కూడా అదిరింది షోలో కనిపించి హంగామా చేసినా జనాన్ని మాత్రం ఆకట్టుకోలేకపోయారు. దీంతో సోషల్ మీడియాలో ఈ షో గురించి చాలమంది కామెంట్స్ చేస్తూ.. జబర్దస్త్ షోని తొక్కేస్తాం.. పొడిచేస్తామంటూ అంటూ మొదలైన ఈ షోలో అస్సలు మ్యాటర్ లేదు అంటూ నాగబాబు పై సెటైర్లు బాగానే పేలాయి. అయితే తాజాగా చమ్మక్ చంద్ర మాట్లాడుతూ.. అదిరింది ప్రోగ్రాంను వెనకేసుకొచ్చాడు. ఈ షో ఆగలేదంటున్నారు. అదిరింది షో టెలికాస్ట్ అయ్యేది జాతీయ ఛానల్.. అందుకే కొన్ని షోస్ వాళ్లు సీజన్స్ వైజ్ గా డివైడ్ చేస్తారు. మళ్లీ త్వరలోనే కొత్త సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తామంటున్నాడు. నాగబాబును నమ్ముకుని రోడ్డున పడలేదు అని క్లారిటీ ఇచ్చాడు ఈ కమెడియన్.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్