
Bandi sanjay తెలంగాణలో అధికార బీఆర్ఎస్ ప్రతిపక్ష నేతల పట్ల వ్యవహరిస్తున్న తీరు విస్తుగొలుపుతోంది. మొన్నటికి మొన్న టీఎస్పీఎస్సీ కుంభకోణంపై ప్రశ్నించినందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని, బీజేపీ చీఫ్ బండి సంజయ్ కు నోటీసులు ఇచ్చారు. రేవంత్ రెడ్డిని విచారించారు కూడా. కానీ బండి సంజయ్ తన లీగల్ టీంను పంపించి విచారణకు హాజరు కాలేదు.
ఇప్పుడు పదోతరగతి పేపర్ లీక్ కేసు అంటూ అర్ధరాత్రి బండి సంజయ్ ఇంటికెళ్లిన పోలీసులు ఆయనను అక్రమంగా అరెస్ట్ చేయడం సంచలనమైంది. తెలంగాణలోని ఒక ప్రధాన ప్రతిపక్ష నేతను.. పైగా ఒక ఎంపీని ఇలా నోటీసులు ఇవ్వకుండా.. వారెంట్ లేకుండా వెళ్లి పోలీసులు కారణం అడిగినా చెప్పకుండా అరెస్ట్ చేయడంపై ఆగ్రహం జ్వాలలు ఎగిసిపడుతున్నాయి..
కరీంనగర్ లో బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు రాత్రికి హైదరాబాద్ తీసుకెళ్లి అనంతరం ఇప్పుడు వరంగల్ కు తరలిస్తున్నారు.
తాజాగా ఆలేరు నుండి జనగామ జిల్లాలోకి ప్రవేశించగానే బండి సంజయ్‌ను వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వేరే వాహనంలో ఎక్కించుకొని తీసుకు వెళుతున్నారు. బండి సంజయ్ ను ఒక అంతర్జాతీయ ఉగ్రవాదిలాగా భారీ పోలీస్ పఠాలంతో అనైతికంగా కార్లు మారుస్తూ తీసుకెళ్లడాన్ని చూసి తెలంగాణ సమాజం అవాక్కవుతున్న పరిస్థితి నెలకొంది.
అసలు బండి సంజయ్ ను ఇంత దుర్మార్గంగా కేసు ఏంటన్నది బయటపెట్టకుండా.. రాత్రికి రాత్రి అరెస్ట్ చేయడం.. వాహనాలు మారుస్తూ జిల్లాలు మారుస్తూ ఇంత దుర్లభంగా తిప్పుతూ వేధింపులకు గురిచేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అందరూ ఈ అనైతిక చర్యలను పోలీసుల తీరును.. ప్రభుత్వ వ్యవహారశైలిని ఖండిస్తున్న పరిస్థితి నెలకొంది.