
Sobhita Dhulipala- Samantha: సమంత దూరమయ్యాక నాగచైతన్య మళ్లీ ప్రేమలో పడ్డాడా? ఆయనతో ఓ సినిమాలో కలిసి నటించిన శోభితా దూళిపాళ తో జీవితం పంచుకోవడానికి రెడీగా ఉన్నారా? వీరు కలిసున్న ఫొటోలు సోషల్ మీడియాలో ఎందుకు వైరల్ అవుతున్నాయి? ఈ పోస్టులపై సమంత ఎలా స్పందించారు? అటు శోభిత దూళిపాళఎలా రియక్టయ్యారు? లాంటి టాపిక్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
సమంత, నాగచైతన్యల విడాకుల విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. పెళ్లి చేసుకొని, ఆ తరువాత దూరమైన వీరిద్దరు ఎవరి పనుల్లో వారు బిజీగా మారారు. అయితే వీరు వేర్వేరుగా మళ్లీ పెళ్లి చేసుకుంటారా? అనే చర్చ సాగుతోంది. ఇటీవల సమంత విడాకుల తేదీని మరిచిపోలేనూ అంటూ హాట్ కామెంట్ చేశారు. ఇదే సమయంలో నాగచైతన్య, నటి శోభిత దూళిపాళ కలిసున్న పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నారు. త్వరలో వీరిద్దరు ఒక్కటి కానున్నారని కొందరు పోస్టులు పెడుతున్నారు. ఈ పోస్టులపై సమంత ‘అదంతా నిజం కాదు’ అని ట్వీట్ చేసింది. కానీ శోభితా దూళిపాళ మాత్రం ‘ఉత్తరం, దక్షిణాది వివాహం’ అని ఓ పెళ్లి ఫొటో పెట్టి క్యాప్షన్ పెట్టడం ఇంట్రెస్టింగ్ గా మారింది.

శోభిత దూళిపాళ నార్త్ సినీ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు. మలయాళం మూవీ ‘కురుప్’తో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చాు. ఆ తరువాత తెలుగులో అడవిశేషు నటించిన ‘మేజర్’లో కనిపించారు. తమిళం మూవీ పొన్నియన్ సెల్వన్ లోనూ సందడి చేశారు. ఆ తరువాత బాలీవుడ్ మూవీ ‘లాల్ సింగ్ చడ్డా’లో నాగచైతన్య తో కలిసి నటించారు. అప్పటి నుంచి వీరి గురించి అనేక పోస్టులు సోషల్ మీడియాల పెట్టి రచ్చ చేస్తున్నారు. పలు సందర్భాల్లో వీరు కలిసున్న ఫొటోలను పెట్టి ఒక్కటి కాబోతున్నారంటూ వైరల్ చేస్తున్నారు.
ఇదే సమయంలో శోబితా దూళిపాళ కొన్ని వెడ్డింగ్ ఫొటోలను సోషల్ మీడియాలో పెళ్లిపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆమె ‘ఉత్తరం, దక్షిణం వివాహం’ అని క్యాప్షన్ పెట్టారు. అయితే ఈ పెళ్లి ఫొటోలు తన సోదరివి. తన సోదరి ఆంధ్రప్రదేశ్ కు చెందినవారు. ఆమె భర్త సాహిల్ ఢిల్లీకి చెందిన వారు. వీరిద్దరిని ఉద్దేశించి ఆమె ఇలా రాసింది. అయితే కొందరు దీనిని అవకాశంగా తీసుకొని ఆమె రాసిన క్యాప్షన్ ను షేర్ చేసి.. నాగచైతన్యతో ఆమెకు ముడిపెడుతున్నారు. వీరు పెళ్లి సందర్భంగా దిగినఫొటోలను ఒక్క దగ్గరిగా చేర్చి త్వరలో ఒక్కటి కాబోతున్నారంటూ వైరల్ చేస్తున్నారు.