Mallareddy- Naga Chaitanya: ఒక సినిమా సక్సెస్ కావడానికి హీరో, హీరోయిన్ తో పాటు టైటిల్, కంటెంట్ బాగుండాలి. కానీ దానిని ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు స్పెషల్ ఈవెంట్స్ నిర్వహించాలి. ఈ ప్రత్యేక కార్యక్రమాలు సాదాసీదాగా ఉంటే సరిపోదు. అక్కడికి ప్రేక్షకుల్లో జోష్ పెంచే వ్యక్తులను పిలవాలి. మొన్నటి వరకు సినీ ఇండస్ట్రీకి చెందిన బిగ్ స్టార్లను ఇలాంటి ఫంక్షన్లకు పిలిచేవారు. కానీ ఈ మధ్య మంత్రి మల్లారెడ్డి సినిమా ఈవెంట్స్ కు అటెండ్ అవుతూ ఆడియన్స్ లో జోష్ పెంచుతున్నారు. ఇప్పటి వరకు ఆయన సినిమా కోసం చేసిన ప్రమోషన్స్ చూసి చాలా మంది ఆయనని తమ ఈవెంట్లకు ఆహ్వానిస్తున్నారు. లేటేస్టుగా ఆయన నాగచైతన్య ‘కస్టడి’ సినిమా ప్రమోషన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నాగచైతన్యపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
మంత్రి మల్లారెడ్డి రాజకీయాల్లో ప్రత్యేకంగా నిలుస్తారు. ఆయన చేసే కామెంట్స్ నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. గతంలో ఓసినిమా ఫంక్షన్లో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మల్లారెడ్డి అంటే ఫేమస్’ అని చెప్పడం ఆసక్తిగా మారింది. తానేం మాట్లాడిని ఇట్టే వైరల్ అవుతుందని చెప్పారు. దీంతో ఆయనతో సినిమా ప్రమోషన్స్ చేయించుకోవాలని చాలా మంది ఇంట్రెస్ట్ పెడుతున్నారు. మల్లారెడ్డికి సంబంధించిన సీఎంఆర్ వేదికపై తాజాగా నిర్వహించిన ‘కస్టడి’ ప్రమోషన్లో యూత్ లో జోష్ పెంచే విధంగా కామెడీ చేశారు. ఇదే సమయంలో నాగచైతన్యపై సంచలన కామెంట్స్ చేశారు.
మల్లారెడ్డి మైక్ పట్టుకోగానే నాగచైతన్యను చూపిస్తూ ఈయన తాతగారు నా ఫేవరేట్ హీరో.. అంటూ తన ప్రసంగం మొదలుపెట్టారు. ఇప్పుడు ఈయన కూడా బిగ్ స్టార్ అవుతారు అని అన్నారు. సీఎంఆర్ వేదికపై సినిమా ప్రమోషన్ చేస్తున్నావ్.. ఇక నీ సినిమా సక్సెస్ అంటూ ఆయనను అభినందించారు. ఆ తరువాత మంత్రి తన చేతిని నాగచైతన్యకు చూపిస్తూ.. ‘ఇది అదృష్టం చేయి.. దీనిని ఒక్కసారి పట్టుకో’ అని తన చేతిని నాగచైతన్యకు ఇచ్చారు. దీంతో ఆయన చేతిలో చేయ్యేసి కలుపుతూ ‘నా చేతిలో చెయ్యేసినవ్ .. ఇక నీ సమస్యలు అన్నీ పోతాయ్’.. అని అన్నారు.
ఈ సందర్భంగా మల్లారెడ్డి అక్కడున్న వారిలో ఉత్సాహాన్ని నింపే విధంగా టాకింగ్ చేయడం అందరినీ ఆకట్టుకుంది. ఇక నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. విలన్ అరవింద స్వామి, శరత్ కుమార్ లు కూడా ఇందులో నటిస్తున్నారు. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజ, ఆయన కుమారుడు యువన్ శంకర్ రాజాలు కలిసి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మార్చి 16న దీనిని థియేటర్లకు తీసుకొస్తున్నారు.