Political Memes: దేశంలో ఇప్పుడు బీజేపీకి తిరుగులేదు. ప్రతిపక్షం కాంగ్రెస్ కు అస్సలు బలం లేదు. బీజేపీ ఎంతగా ఎదుగుతుందో.. కాంగ్రెస్ పరిస్థితి అంతగా దిగజారుతోంది.ఇక కాంగ్రెస్ ను తోసిరాజని కొత్తగా ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టుకొచ్చింది. పంజాబ్ లో ఏకంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించి విజయఢంకా మోగించింది. ఇప్పటికే ఢిల్లీలో బీజేపీని ఓడించిన ఆమ్ ఆద్మీ ఇప్పుడు కాంగ్రెస్ కు ప్రత్యామ్మాయంగా జాతీయ రాజకీయాల్లో ఎదుగుతోంది.

ఆమ్ ఆద్మీ ఖాతాలో ఇప్పటికే రెండు రాష్ట్రాలు చేరాయి. గోవా సహా పలు రాష్ట్రాల్లోనూ ఎమ్మెల్యే సీట్లను గెలుచుకొని సత్తా చాటింది. ఈ క్రమంలోనే నెటిజన్లు తమ సృజనాత్మకతను వెలికి తీస్తున్నారు.కాంగ్రెస్ హస్తం గుర్తునుంచే చీపురు అవతరించిందనేలా మ్యాపులు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
కాంగ్రెస్ హస్తం.. చీపురుగా మారిన తీరును మ్యాప్ లు వేస్తూ ఆదిమానవుడి నుంచి ఆధునిక మానవుడు పుట్టిన విధంగా తమ క్రియేటివిటీతో కాంగ్రెస్ హస్తాన్ని ఖతం చేసి ఆమ్ ఆద్మీ ‘చీపురు’ను పుట్టిస్తున్నారు.
Also Read: Y S Sharmila Hiking: అయ్యయ్యో.. షర్మిల పాదయాత్రను ఎవరూ పట్టించుకోరే..!
ఇక ఇవే గుర్తులు కాదు.. యూపీలో సమాజవాదీ సైకిల్ గుర్తుపై కూడా కమలనాథులు, నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. సైకిల్ పంచర్ అయినట్టు.. సైకిల్, కమలం గుర్తును పోల్చి నానా క్రియేట్ చేస్తున్నారు. బీఎస్పీ ఏనుగుపై కూడా కామెడీగా మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
ఇక దేశంలోకి మోడీకి పోటీగా ఎదుగుదామని కలలుగన్న మమతా బెనర్జీ, కేసీఆర్ లపై కూడా సెటైర్లు పేలుతున్నాయి. ఐదురాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత వీరిపై మీమ్స్ ఎక్కువయ్యాయి. వీరిద్దరికంటే కేజ్రీవాల్ బెటర్ అంటూ కార్టూన్లు జోడించి మరీ నెటిజన్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.
Also Read: Nara Lokesh: అమ్మఒడి.. నాన్న బుడ్డి, ఏపీ బడ్జెట్ పై నారా లోకేష్ సెటైర్లు వైరల్
[…] Raghul Gandhi: దేశంలో జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓటమి పాలైంది. కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ప్రతిపక్ష హోదా కూడా పొందలేకపోవడం గమనార్హం. దీంతో పార్టీ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. స్వాతంత్ర్యం నుంచి దేశంలో సమర్థవంతమైన పాలన అందించిన పార్టీగా వినుతికెక్కినా ప్రస్తుతం చావు తప్పి కన్ను లొట్టబోయినట్లుగా కాంగ్రెస్ పరిస్థితి అధ్వానంగా తయారయింది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం యూపీలో కనీసం రెండో స్థానంలో కూడా నిలవేలకపోయింది. సమాజ్ వాదీ పార్టీ ప్రతిపక్ష హోదా దక్కించుకోగా కాంగ్రెస పార్టీ కేవలం రెండు చోట్ల మాత్రమే విజయం సాధించి పరువు కోల్పోయింది. […]