https://oktelugu.com/

Viral Cinema: వైరల్ అవుతున్న టుడే మూవీ అప్ డేట్స్

Viral Cinema: సినిమా వైరల్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. కొంతమంది బాలీవుడ్‌ క్రిటిక్స్‌ పనిగట్టుకొని తెలుగు చిత్రాలకు నెగిటివ్‌ రేటింగ్స్‌ ఇస్తున్నారు. పుష్పను ఇలానే అణచివేయాలనుకుంటే బాక్సాఫీస్‌ విన్నర్‌గా నిలిచింది. రాధేశ్యామ్‌కు కూడా మరీ దారుణంగా 1.5, 2 రేటింగ్స్‌ ఇచ్చారు కొంతమంది క్రిటిక్స్. అయితే మొదటి రోజు వసూళ్లు అదిరిపోయాయి. నూన్‌, ఈవెనింగ్‌ షోస్‌పై క్రిటిక్స్‌ ప్రభావం పడలేదు. రానున్న రోజుల్లో చిత్రం పుంజుకుంటుంది అంటున్నాయి ట్రేడ్‌ వర్గాలు. మరో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : March 12, 2022 / 02:28 PM IST

    Radhe Shyam

    Follow us on

    Viral Cinema: సినిమా వైరల్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. కొంతమంది బాలీవుడ్‌ క్రిటిక్స్‌ పనిగట్టుకొని తెలుగు చిత్రాలకు నెగిటివ్‌ రేటింగ్స్‌ ఇస్తున్నారు. పుష్పను ఇలానే అణచివేయాలనుకుంటే బాక్సాఫీస్‌ విన్నర్‌గా నిలిచింది. రాధేశ్యామ్‌కు కూడా మరీ దారుణంగా 1.5, 2 రేటింగ్స్‌ ఇచ్చారు కొంతమంది క్రిటిక్స్. అయితే మొదటి రోజు వసూళ్లు అదిరిపోయాయి. నూన్‌, ఈవెనింగ్‌ షోస్‌పై క్రిటిక్స్‌ ప్రభావం పడలేదు. రానున్న రోజుల్లో చిత్రం పుంజుకుంటుంది అంటున్నాయి ట్రేడ్‌ వర్గాలు.

    Radhe Shyam AP & Telangana Collections

    మరో అప్ డేట్ విషయానికి వస్తే.. ఈనెల 14న గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామ సమీపంలో జనసేన ఆవిర్భావ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ .. సభ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆవిర్భావ సభ సందర్భంగా యూట్యూబ్‌లో ప్రత్యేక గీతం విడుదల చేశారు. జనసైనికులను ఉత్సాహపరిచేలా ఉన్న స్పెషల్‌ సాంగ్‌ పవన్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది.

    Also Read:  రామ్ సినిమాలో జాన్వీ కపూర్ ?

    Janasena

    ఇక మరో అప్ డేట్ ఏమిటంటే..ట్విట్టర్, ఇన్స్టా ద్వారా పలువురు హీరోయిన్లు తమకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంటారు. అయితే కొంతమంది ముద్దుగుమ్మలు మాత్రం యూట్యూబ్ ఛానళ్ల ద్వారా ఫ్యాన్స్కు చేరువవుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి రష్మిక చేరింది. రష్మిక తన యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించింది.

    Rashmika Mandanna

    కాగా ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపింది. తన యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అంటూ ఓ వీడియోను కూడా పోస్ట్ చేసింది ఈ బ్యూటీ.

    Also Read:  బాక్సాఫీస్ : ‘రాధేశ్యామ్’ ఏపీ & తెలంగాణ సెకండ్ డే కలెక్షన్స్

    Tags