Mega Family : ప్రతీరోజూ పండుగే.. చిరంజీవి ఫ్యామిలీ యూనిటీ వెనుక కారణం ఇదే…

మెగా హీరోలు అయిన చిరంజీవి, నాగబాబు తమ కూతుర్లు లైఫ్ లో సంతోషం గా ఉండటమే వాళ్ల కి కావాలి అనేంత లా వాళ్ల పిల్లల కోసమే ఏదైనా చేస్తూ ముందుకు కదులుతున్నారు.

Written By: Gopi, Updated On : January 19, 2024 11:28 am
Follow us on

Mega Family : సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు, హీరోయిన్లు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. అయితే వీళ్ళు కలిసి బతకాలి అని పెళ్లి బంధం తో ఒకటవుతారు. కానీ ఆ తర్వాత వాళ్ళ మధ్య వచ్చిన కొన్ని విభేదాలతో విడాకులు తీసుకొని విడిపోతున్నారు. ఇక ఈ విషయంలో మెగా ఫ్యామిలీ పేరు సోషల్ మీడియాలో విపరీతంగా వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే చిరంజీవి కూతురు అయిన శ్రీజ మొదట ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంది. అతనితో ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత అతనితో విడిపోయి మళ్లీ ఇంటి బాట పట్టింది.

ఇలా కొద్ది రోజులు గడిచిన తర్వాత వాళ్ల ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన కళ్యాణ్ దేవ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక అతనితో కూడా ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ప్రస్తుతం అతనికి దూరం గా ఉంటుంది. అయితే వీళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు అనేది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది అంటూ సోషల్ మీడియా లో పెద్ద చర్చ అయితే జరుగుతుంది.ఇక ఇదిలా ఉంటే నాగబాబు కూతురు అయిన నిహారిక కూడా చైతన్య అనే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. పెద్దలు కుదిర్చిన సంబంధం అని పెళ్లి చేసుకుంది. అయితే వీళ్ళ పెళ్లి బంధం కూడా ఎక్కువ రోజులు నిలవలేదు.

వీళ్లు కూడా సపరేట్ గా ఉంటూ విడాకులు తీసుకున్నారు అనే వార్తలకు బలాన్ని చేకూరుస్తున్నారు. ఇక ఆ మధ్య నిహారిక పెట్టిన ఒక పోస్ట్ తో వీళ్ళ మధ్య గొడవలు ఉన్నాయి విడిపోవడానికి రెఢీ గా ఉన్నారు అనే విషయం అయితే అర్థమైంది. ఇక దాంతో నిహారిక నాగబాబు దగ్గరే ఉంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే చిరంజీవి తన కూతురు కి నచ్చినట్టుగా తన లైఫ్ లీడ్ చేయాలి అంటూ తను ఎవరిని అయితే పెళ్లి చేసుకోవాలనుకుందో వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేశాడు.

మళ్ళీ వాళ్లతో తనకి ఇబ్బంది ఉంది అని చెబితే తను కూడా ఆ విషయం లో ఏం మాట్లాడలేకపోయాడు. దాంతో శ్రీజ ప్రస్తుతం చిరంజీవి దగ్గరే ఉంటుంది. ఇక నాగబాబు కూడా తన కూతురు భర్తకు దూరంగా ఉంటూ బాధపడకూడదు అనే ఉద్దేశ్యంతో తనకు ఒక ప్రొడక్షన్ హౌజ్ ని స్టార్ట్ చేసి ఇచ్చాడు. ఇక దాంతో ఇప్పుడు నిహారిక చాలా బిజీగా గడుపుతుంది అలాగే ఒక టాప్ ప్రొడ్యూసర్ గా తనని తాను ప్రూవ్ చేసుకోవాలని చూస్తుంది…

అయితే మెగా హీరోలు అయిన చిరంజీవి, నాగబాబు తమ కూతుర్లు లైఫ్ లో సంతోషం గా ఉండటమే వాళ్ల కి కావాలి అనేంత లా వాళ్ల పిల్లల కోసమే ఏదైనా చేస్తూ ముందుకు కదులుతున్నారు….ఇక ఇది చూసిన మెగా అభిమానులు ఈ విషయం లో ఈ హీరోలను మెచ్చుకుంటున్నారు…