https://oktelugu.com/

Annamalai : అన్నామలై పై ఎన్.రామ్ ఆధ్వర్యాన మీడియా ముప్పేట దాడి

‘అన్నామలై పై ఎన్ రామ్ ఆధ్వర్యాన మీడియా ముప్పేట దాడి’ ఘటనపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : January 28, 2024 / 07:29 PM IST
    Follow us on

    Annamalai : తమిళనాడులో ఊహించిందే జరుగుతోంది. అన్నామలైపై ఊహించని దాడి మొదలైంది. దానికి ఇప్పుడు ముహూర్తం పెట్టుకున్నారు. ఎన్.రామ్ ఆధ్వర్యంలోని ‘హిందూ’ పత్రిక విషం చిమ్ముతోంది. సీపీఐ మద్దతుతో చెలరేగుతోంది.

    జనవరి 25న వల్లువార్ కొట్టార్ లో జర్నలిస్టులందరూ ఒక సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి హిందూ పత్రిక అధినేత ఎన్.రామ్ నాయకత్వం వహించారు. ఇందులో ఒక తీర్మానం చేశారు. అన్నామలైను బాయ్ కాట్ చేయాలని జర్నలిస్టులందరూ డిమాండ్ చేశారు. అన్నామలై వార్తలను బ్లాక్ అవుట్ చేయండి. అన్నామలైపై క్రిమినల్ డిఫెన్స్ ఇవ్వండని నిలదీశారు.

    ఇంతకీ అన్నామలైకి మీడియాపై ఎందుకు కోపం వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.. న్యూస్ 18 తమిళ్ వాళ్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూ చేశారు. సీనియర్ జర్నలిస్ట్ కార్తిగాయి చల్వాన్ స్వయంగా ఉదయనిధి స్టాలిన్ ను ఇంటర్వ్యూ చేశారు. టఫ్ ప్రశ్నలు వేయలేదని.. కార్తిగాయి జర్నలిస్ట్ తీరు సరిగా లేదని అన్నామలై ప్రశ్నించారు.

    జర్నలిస్టులనే విమర్శించిన అన్నామలైపై జర్నలిస్టులందరూ బాయ్ కాట్ చేయాలని మీటింగ్ పెట్టారు. దీనికి ఎన్.రామ్ ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు.

    ‘అన్నామలై పై ఎన్ రామ్ ఆధ్వర్యాన మీడియా ముప్పేట దాడి’ ఘటనపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.