https://oktelugu.com/

Meat Food : ప్రపంచంలో అత్యధికంగా ఏ మాంసాన్ని ఇష్టపడుతున్నారు?

భారత్ విషయానికొస్తే అత్యంత తక్కువ మాంసం వినియోగిస్తున్న దేశంగా నిలిచింది. ఇక్కడ

Written By:
  • Srinivas
  • , Updated On : February 10, 2024 / 04:48 PM IST

    meet food

    Follow us on

    Meat Food : శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అన్నిరకాల పోషకాలు ఉన్న పదార్థాలను తీసుకోవాలి. కొన్ని పదార్థాల్లో కావాలసిన దాని కంటే ఎక్కువగా విటమిన్లు, ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. అందువల్ల వాటిని తీసుకోవాలని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా మాంసాహారకృతుల్లో ఎక్కువగా ప్రోటీన్లు ఉంటాయి. శాఖాహారం కంటే ఇందులో అధికంగా ఉండడంతో పాటు వీటి రుచి కూడా ఎక్కువగా ఉండడం వాటికి డిమాండ్ పెరుగుతోంది. దేశంలో కోడి, గొర్రె మాంసం ఎక్కువగా తీసుకుంటారు. కానీ ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో వివిధ జంతువుల మాంసాహారాన్ని ఇష్టపడి తింటూ ఉంటారు. మరి ప్రపంచంలో అత్యధికంగా ఏ జంతువు మాంసాన్ని ఎక్కువగా తీసుకుంటారో చూద్దాం…

    ప్రపంచ వ్యాప్తంగా గత 50 ఏళ్లలో మాంసాహార వినియోగం పెరిగింది. 2017 లెక్కల ప్రకారం 330 మిలియన్ టన్నులు ఉంది. ప్రజల ఆదాయం పెరగడంతో పాటు ఆరోగ్యం సంరక్షణకు శ్రద్ధ తీసుకోకునేందుకు చొరవ చూపడంతో మాంసం వినియోగం పెరిగినట్లు తెలుస్తోంది. కొన్ని దేశాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నా.. మాంసం వినియోగం మాత్రం తగ్గడం లేదు. అయితే సంపన్న దేశాల్లో ఎక్కువ మాంసం వినియోగిస్తుండగా పేద దేశాల్లో వినియోగం తక్కువగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఏ జంతువు మాంసం ఎక్కువగా తింటున్నారనే విషయాన్ని పరిశీలిస్తే పంది మాంసానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది.

    ప్రపంచంలో అత్యధికంగా ప్రజలు ఇష్టపడే మాంసాల్లో పోర్క్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తరువాత చికెన్ ను ఎక్కువగా తింటారు. భారత్ లో చికెన్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఆ తరువాత మూడో స్థానంలో గొడ్డు మాంసం ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీని ధర తక్కువగా ఉండడంతో చాలా మంది దీనికి ప్రాధాన్యత ఇస్తున్నారు. మేకలు నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ ఎక్కువగా ఆసక్తి చూపడం లేదు. ఐదో స్థానంలో టర్కీ కోడి ఉంది. దీనిని ఎక్కువగా ఉత్తర అమెరికా, మెక్సికోలో ఎక్కువగా వాడుతారు.

    ప్రపంచంలో బాతు మాంసం ఆరో స్థానంలో నిలిచింది. దీనిని చైనా, అమెరికాలో ఎక్కువగా వినియోగిస్తారు. ఏడో స్థానంలో గేదె మాంసం ఉంది. దీనిని ఆసియాలోని కొన్ని దేశాల్లో ఎక్కువగా తింటారు. కుందేలు మాంసం 8వ స్థానంలో నిలిచింది. దీనిని చైనా, ఉత్తర కొరియాలో ఎక్కువగా తింటారు. తొమ్మిదో స్థానంలో జింక ఉండగా..జపాన్ లో ఈ మాంసాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు.

    భారత్ విషయానికొస్తే అత్యంత తక్కువ మాంసం వినియోగిస్తున్న దేశంగా నిలిచింది. ఇక్కడ మాంసాహారం కంటే శాఖాహరం కు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఒక సర్వే ప్రకారం మూడింటరెండు వంతుల మాంసాహారం వినియోగిస్తున్నారని తేలినా.. సగటు వినియోగం తక్కువగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆధ్యాత్మిక భావాలు ఎక్కువగా ఉండడం వల్ల మాంసాహారం జోలికి వెళ్లరు.