కరోనా మహమ్మారి విజృంభణ ప్రజల జీవన విధానంలో అనేక మార్పులు చేసింది. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను తరచూ శానిటైజర్ తో శుభ్రపరచుకోవడం మనిషి జీవితంలో భాగమయ్యాయి. వస్తువుల ద్వారా కూడా కరోనా వైరస్ సోకే అవకాశం ఉండటంతో ప్రజలు ఏవైనా వస్తువులను ముట్టుకునే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డబ్బులు తీసుకోవడానికి ఏటీఎంను ముట్టుకోవాలన్నా భయపడుతున్నారు.
Also Read: హెలికాప్టర్ కొనుక్కోవడానికి రుణం.. రాష్ట్రపతికి మహిళ రాసిన లేఖ వైరల్..!
అయితే మాస్టర్ కార్డ్ ఏటీఎంను ముట్టుకోకుండా క్యాష్ ను విత్ డ్రా చేసే అవకాశం కల్పిస్తోంది. మాస్టర్ కార్డును కలిగి ఉన్నవాళ్లు కాంటాక్ట్‌లెస్‌గా క్యాష్ డ్రా చేసుకునే అవకాశాన్ని మాస్టర్ కార్డ్ కల్పిస్తోంది. కాంటాక్ట్‌లెస్‌గా క్యాష్ డ్రా కొరకు యూజర్లు తమ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్ ద్వారా ఏటీఎం స్క్రీన్ పై ఉండే క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ అప్లికేషన్ లోనే అమౌంట్ తో పాటు ఏటీఎం పిన్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
Also Read: వాహనదారులకు షాక్.. భారీగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు..?
ఈ విధానం ద్వారా ఏటీఎం మోసాలను కూడా సులభంగా తగ్గించే అవకాశాలు ఉంటాయి. నెలకు మూడుసార్లు ఎటువంటి అదనపు ఛార్జీలు చెల్లించకుండా మాస్టర్ కార్డ్ సహాయంతో నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. క్యూఆర్ బేస్డ్ క్యాష్ విత్ డ్రా ద్వారా భవిష్యత్తులో ఏటీఎం నుంచి నగదు విత్ డ్రా విషయంలో కీలక మార్పులు రానున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కాంటాక్ట్ లెస్ విత్ డ్రా ద్వారా నగదు విత్ డ్రా చేయడం మంచిదని వెల్లడిస్తున్నారు.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
కార్డు ఉపయోగించకుండా ఏటీఎంను తాకకుండానే డబ్బును విత్ డ్రా చేసే అవకాశాన్ని మాస్టర్ కార్డు కల్పిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో వీసా, రూపే సైతం ఈ తరహా కార్డులను యూజర్లకు అందుబాటులోకి తెచ్చే అవకాశాలు ఉన్నాయి.