https://oktelugu.com/

ఉద్యోగాలు.. పీఆర్సీ అన్నీ కేసీఆర్ రాజకీయాలే..

తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పే.. మాటలు.. చేసే చేతల్లో చాలా తేడా ఉంటుందని ఇప్పటికే రాష్ట్ర ప్రజలు గమనించారు. ప్రజలు దేని గురించి ఆలోచిస్తున్నారు.. వారికి కావల్సింది ఏమిటీ..? నేను ఇవ్వాల్సింది ఏమిటి..? అనే అంశాన్ని క్షుణ్ణంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం కేసీఆర్ దిట్ట. ఈ పద్ధతిని అవలంబిస్తూనే.. రెండోసారి కూడా సీఎం పీఠాన్ని అధిరోహించారు. రాష్ట్రంలో తిరుగులేని నేతగా ఎదిగారు. ముందుగా తిట్టించుకుని.. తరువాత పాలాభిషేకం చేయించుకోవడం.. కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య. Also […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 12, 2021 / 03:29 PM IST
    Follow us on


    తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పే.. మాటలు.. చేసే చేతల్లో చాలా తేడా ఉంటుందని ఇప్పటికే రాష్ట్ర ప్రజలు గమనించారు. ప్రజలు దేని గురించి ఆలోచిస్తున్నారు.. వారికి కావల్సింది ఏమిటీ..? నేను ఇవ్వాల్సింది ఏమిటి..? అనే అంశాన్ని క్షుణ్ణంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం కేసీఆర్ దిట్ట. ఈ పద్ధతిని అవలంబిస్తూనే.. రెండోసారి కూడా సీఎం పీఠాన్ని అధిరోహించారు. రాష్ట్రంలో తిరుగులేని నేతగా ఎదిగారు. ముందుగా తిట్టించుకుని.. తరువాత పాలాభిషేకం చేయించుకోవడం.. కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య.

    Also Read: ఖమ్మం నుంచే షర్మిల తొలి అడుగు..

    రెండు నెలల క్రితం 50వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అప్పడు అందరూ అనుమానం వ్యక్తం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. అందుకే ఈ ప్రకటన.. ఒక్క అడుగు ముందుకు వేయరు కానీ .. తరువాత అధికారులతో చాలా సీరియస్ గా సమీక్షించారు. నిజంగా నోటిఫికేషన్ ఇచ్చేస్తారేమోనని నిరుద్యోగులు అప్పుడే పుస్తకాలతో కుస్తీకూడా పడుతున్నారు.

    అదే విధంగా ఉద్యోగుల పీఆర్సీ కూడా ఎప్పటి నుంచో పెండింగులో ఉంది. పీఆర్సీ కమిటీని ప్రభుత్వానికి నివేదిక సమర్పించేలా చేశారు. అయితే దానిపై ఉద్యోగులు ఏకాభిప్రాయానికి రాకుండానే ఏడున్నరశాతమే.. ఉండేలా చూసుకున్నారు. దీంతో ఉద్యోగులు సీఎంతోనే తేల్చుకుంటామని అన్నారు. అదిగో సీఎం సమావేశం.. ఇదిగో సీఎం సమావేశం అంటుండగానే.. ఎమ్మెల్సీ కోడ్ వచ్చేసింది. తెలంగాణలో రెండు పట్టభద్రుల స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేయగా.. 16న నోటిపికేషన్ వెలువడుతుంది. మార్చి 14న ఎన్నికలు ఉంటాయి. ఇవి ముగియగానే నాగర్జున సాగర్ ఎన్నికలు వస్తాయి. దీనితో నాలుగు నెలలు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండనుంది.

    Also Read: గల్లీలు వదిలి పవన్ ఢిల్లీలో ఏం చేస్తున్నట్టు?

    కోడ్ ఉన్న సమయంలో రాష్ట్రంలో ఉద్యోగుల జీతాల పెంపు.. నోటిఫికేషన్లకు వీలు ఉండదు. ఈ నేపథ్యంలో కోడ్ వచ్చేవరకు ప్రభుత్వం కావాలనే పీఆర్సీని పెండింగులో పెట్టిందని ఉద్యోగ సంఘాల నాయకులు అంటున్నారు. ఉద్యోగులకు జీతాలు పెంచడం సీఎం కేసీఆర్ కు ఇష్టం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున సాగర్ ఎన్నికల నేపథ్యంలోనే నల్లగొండకు హామీల వర్షం కురిపించారని.. వాటిని నమ్మడం.. నమ్మకపోవడంపై ప్రజలు ఆలోచన చేయాలని విపక్షాలు అంటున్నాయి.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్