కేరళలో జరిగిన ఒక వివాహ వేడుక ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ప్రస్తుతం అందరూ ఈ వివాహం గురించి ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ముగ్గురు కవల సోదరీమణులు ఒకే సమయంలో పెళ్లిళ్లు చేసుకున్నారు. గతంలో ఎక్కడా ఇలా ముగ్గురు కవల సోదరీమణులు వివాహం చేసుకోలేదని తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ముగ్గురు కవల సోదరీమణుల వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.
Also Read: దంతాలు తెల్లగా మెరవడానికి పాటించాల్సిన టిప్స్ ఇవే..?
పూర్తి వివరాల్లోకి వెళితే కేరళలోని తిరువనంతపురానికి చెందిన రమాదేవి అనే మహిళ 1995 సంవత్సరం నవంబర్ నెల 18వ తేదీన ఒకే కాన్పులో ఐదుగురు శిశువులకు జన్మనిచ్చింది. వాళ్లలో నలుగురు ఆడపిల్లలు కాగా ఒక మగపిల్లాడు ఉన్నారు. ఈ ఐదుగురు పిల్లలు ఉత్తమ్ అనే నక్షత్రంలో పుట్టడం వల్ల వీళ్ల తల్లిదండ్రులు ఉత్తమ్ పేరు కలిసొచ్చే విధంగా పిల్లలకు నామకరణం చేశారు. వీళ్ల గురించి గతంలో కూడా అనేక కథనాలు ప్రచురించబడ్డాయి.
రమాదేవి నలుగురు కూతుళ్లకు ఒకేసారి వివాహం చేయాలని సంకల్పించి నలుగురికి ఒకేసారి నిశ్చితార్థ మహోత్సవాన్ని నిర్వహించారు. అయితే అనివార్య కారణాల వల్ల ఒక కుమార్తె వివాహం ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో ముగ్గురు కూతుళ్లకు ఒకే వేదికపై పెళ్లిళ్లు జరిపారు. కరోనా, లాక్ డౌన్ వల్ల మరొక యువతిని పెళ్లి చేసుకోబోయే వరుడు కువైట్ లో ఇరుక్కుపోవడంతో ఆ యువతి వివాహం ఆలస్యంగా జరగనుంది.
Also Read: హైబీపీ ఉన్నవాళ్లు ఈ పండు తింటే చాలు..!
రమాదేవి మాట్లాడుతూ ఒకే కాన్పులో ఐదుగురు పిల్లలకు జన్మనివ్వడం వినడానికి బాగానే ఉన్నా పిల్లలను పెంచటానికి తాను తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నానని.. భర్త ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ భారం అంతా తనపైనే పడిందని.. ఎంతో కష్టపడి వాళ్లను ఉన్నత చదువులు చదివించానని పేర్కొన్నారు. మంచి ఉద్యోగాల్లో స్థిరపడిన భర్తలతో కూతుళ్ల వివాహం చేయనున్నట్టు రమాదేవి వెల్లడించారు.