https://oktelugu.com/

‘ఆర్ఆర్ఆర్’: హీరోలతో రాజమౌళికి కత్తిమీద సామేనా?

బాహుబలి సీరీసుల తర్వాత దర్శక దిగ్గజం రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధరం). డీవీవీ దానయ్య భారీ బడ్జెట్లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రాంచరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. Also Read: త్రివిక్రమ్‌కు కొత్త తిప్పలు తెచ్చిపెట్టిన రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఇప్పటికే ‘భీమ్ ఫర్ రామరాజు’.. ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్లు […]

Written By:
  • NARESH
  • , Updated On : October 26, 2020 / 09:58 AM IST
    Follow us on

    బాహుబలి సీరీసుల తర్వాత దర్శక దిగ్గజం రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధరం). డీవీవీ దానయ్య భారీ బడ్జెట్లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రాంచరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

    Also Read: త్రివిక్రమ్‌కు కొత్త తిప్పలు తెచ్చిపెట్టిన రాజమౌళి

    ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఇప్పటికే ‘భీమ్ ఫర్ రామరాజు’.. ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్లు విడుదలయ్యాయి. ఈ రెండు టీజర్లు కూడా సోషల్ మీడియాలో ఒకేలా ట్రెండ్ సెట్ చేస్తున్నారు. దీంతో అటూ మెగా ఫ్యాన్స్.. ఇటూ నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే ‘ఆర్ఆర్ఆర్’లో ఇద్దరు హీరోలను రాజమౌళి సమంగా చూపించడం సాధ్యమేనా అనే చర్చ మాత్రం అభిమానుల మధ్య జోరుగా సాగుతోంది.

    టాలీవుడ్లో ఎప్పటి నుంచో మెగా హీరో.. నందమూరి హీరోల మధ్య వార్ నడుస్తోంది. ప్రతీ సీజన్లోనూ బాక్సాఫీస్ వద్ద మెగా హీరో.. నందమూరి హీరోల మధ్య పోటీ కొనసాగుతూనే ఉంది. సినిమాల్లో వీరి మధ్య పోటీ ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా మాత్రం మెగా.. నందమూరి హీరోలు చాలా స్నేహంగా ఉంటారనేది అందరికీ తెల్సిందే.

    మెగా పవర్ స్టార్ రాంచరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా చాలా స్నేహంగా ఉంటారు. ఒకరింటికి మరొకరు వెళుతూ చాలా సరదా గడుపుతూ ఉంటారు. ఈక్రమంలో వీరిద్దరు ఒకే సినిమాలో నటిస్తుండటంతో అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. దర్శకుడు రాజమౌళి కూడా వీరద్దరి స్నేహన్ని ఈ సినిమాలో బాగా వాడుకున్నట్లు చెప్పాడు.

    అయితే వీరిద్దరిని స్క్రీన్ షేరింగ్ విషయంలో సమంగా చూపించడం సాధ్యమయ్యేనా? అనే ప్రశ్న తలెత్తుతోంది. చరణ్.. ఎన్టీఆర్ ఇద్దరు కూడా టాలీవుడ్లో స్టార్ హీరోలు. వీరిద్దరిలో ఎవరినీ తక్కువగా చూపించినా కూడా అభిమానుల మధ్య రచ్చ అవడం ఖాయం. మల్టిస్టారర్ మూవీల్లో ఒక హీరోను కొంచెం ఎక్కువగా చూపించడం కామన్.

    Also Read: పవన్ సినిమా వెనుక గురూజీ హస్తం ఉందన్నమాట !

    ఒకే ఇమేజ్ ఉన్న ఇద్దరి హీరోలను రాజమౌళి హ్యండిల్ చేయడం కత్తిమీద సాములాంటిదనే టాక్ ఇండస్ట్రీలో విన్పిస్తోంది. ఇప్పటివరకైతే రాజమౌళి ఇద్దరి హీరోలను సమంగానే చూపిస్తారనే టాక్ విన్పిస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ విడుదలైతేగానీ ఏ హీరోను ఎంత బాగా చూపించడనేది క్లారిటీ రానుంది. దీంతో ఈ మూవీ కోసం నందమూరి.. మెగా ఫ్యాన్స్ వేయికళ్లతో వేచిచూస్తున్నారు.