https://oktelugu.com/

అణ్వాయుధాలు నిషేధం.. ప్రపంచశాంతికి బీజం

అది రెండో ప్రపంచ యుద్ధం. రెచ్చిపోతున్న జపాన్ పై నాటి అమెరికా అణుబాంబులు వేసింది. జపాన్ లోని హిరోషిమా, నాగసాకిపై అమెరికా వేసిన అణుబాంబుల ప్రభావం ఇప్పటికీ వెంటాడుతోంది. మానవాళి మనుగడకు ప్రమాదకరంగా మారిన ఈ అణ్వాయుధాలపై నిషేధం విధించాలని అంతర్జాతీయ పౌరసంఘాలు పోరాటం సాగిస్తున్నాయి. ఈ సమయంలోనే ఐక్య రాజ్యసమితి భారీ ముందడుగు వేసింది. ఏకంగా 75 ఏళ్ల సుధీర్ఘ నిరీక్షణ తర్వాత అణ్వాయుధ నిషేధం అమలులోకి వచ్చింది. Also Read: ఒకే వేదికపై ముగ్గురు […]

Written By:
  • NARESH
  • , Updated On : October 26, 2020 12:08 pm
    Follow us on

    nuclear weapons

    అది రెండో ప్రపంచ యుద్ధం. రెచ్చిపోతున్న జపాన్ పై నాటి అమెరికా అణుబాంబులు వేసింది. జపాన్ లోని హిరోషిమా, నాగసాకిపై అమెరికా వేసిన అణుబాంబుల ప్రభావం ఇప్పటికీ వెంటాడుతోంది. మానవాళి మనుగడకు ప్రమాదకరంగా మారిన ఈ అణ్వాయుధాలపై నిషేధం విధించాలని అంతర్జాతీయ పౌరసంఘాలు పోరాటం సాగిస్తున్నాయి. ఈ సమయంలోనే ఐక్య రాజ్యసమితి భారీ ముందడుగు వేసింది. ఏకంగా 75 ఏళ్ల సుధీర్ఘ నిరీక్షణ తర్వాత అణ్వాయుధ నిషేధం అమలులోకి వచ్చింది.

    Also Read: ఒకే వేదికపై ముగ్గురు కవల సోదరీమణులకు వివాహం.. ఎక్కడంటే..?

    ప్రపంచశాంతికి అడుగులు పడ్డాయి. ఐరాసలోని 50 సభ్యదేశాలు అణ్వాయుధాల నిషేధిత ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ 50 దేశాలు ఇక అణ్వాయుధాలను నిషేధించినట్టే. ఇదొక గొప్ప పరిణామంగా ఐరాసా అభివర్ణిస్తోంది.

    అయితే అమెరికాతోపాటు అణ్వాయుధాలు కలిగిన శక్తిమంతమైన దేశాలు ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యాలు కూడా ఈ ఒప్పందంపై సంతకం చేయలేదు. ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని అమెరికా పట్టుబడుతోంది.

    అణ్వాయుధాల నిషేధిత ఒప్పందానికి ఇప్పటివరకు 50 దేశాలు ఆమోదం తెలిపినట్టు ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. దీంతో వచ్చే మూడు నెలల్లోనే ఈ ఒప్పందం అమలులోకి రానుంది. ఈ అంతర్జాతీయ ఒప్పందానికి 50 దేశాలు ముందుకు రావడం చారిత్రక మైలురాయిగా ఐరాస అభివర్ణించింది.

    Also Read: ప్రియురాలి సమాధి దగ్గర చనిపోయిన ప్రియుడు.. ఏం జరిగిందంటే..?

    ఈ సందర్భంగా ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెర్రస్ మాట్లాడుతూ.. దీనివల్ల ప్రపంచాన్ని మేల్కొలపడం మరింత సులభమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 2021 జనవరి 22 నుంచి ఈ అణ్వాయుధ నిషేధం అమలులోకి వస్తుంది.