మారుతున్న కాలంతో పాటు ప్రేమ పెళ్లిళ్లు సాధారణం అయిపోయాయి. నగరాల్లో యువత తల్లిదండ్రులు సైతం ప్రేమపెళ్లిళ్లను అంగీకరిస్తున్నారు. గ్రామాల్లో పూర్తిస్థాయిలో అంగీకరించే పరిస్థితి లేకపోయినా గతంతో పోలిస్తే పరిస్థితుల్లో మార్పు వస్తోంది. భవిష్యత్తులో సైతం ప్రేమ పెళ్లిళ్లే ఎక్కువ సంఖ్యలో జరిగే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ప్రేమ పెళ్లిళ్లకు అంగీకరించపోతే పారిపోయి పెళ్లి చేసుకున్న ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి.
అయితే దేశంలో చాలావరకు ప్రేమించుకున్న వాళ్లు విడిపోవడం, అమ్మాయి అబ్బాయిలలో ఎవరో ఒకరు హ్యాండ్ ఇవ్వడం లాంటి ఘటనలే ఎక్కువగా ఉన్నాయి. అయితే ప్రేమించిన అమ్మాయి లేదా అబ్బాయి విడిపోయి దూరమైతే భగ్న ప్రేమికులు అయ్యేవాళ్లను మనం చూసే ఉంటాం. అయితే ఇక్కడ మాత్రం చిత్రవిచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ప్రేమికురాలు విడిపోయిందని తనను తానే పెళ్లి చేసుకున్నాడు.
ప్రపంచంలో ఎక్కడా జరగని వింత ఘటన బ్రెజిల్ లో చోటు చేసుకుంది. విటర్ బ్యూనో, డియాగో రేబెలో ఒకరినొకరు చాలానెలలుగా ప్రేమించుకున్నారు. ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు రావడంతో ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా విడిపోయారు. ప్రియురాలితో బ్రేకప్ కావడంతో డియాగో చాలా బాధపడ్డాడు. విడిపోవడంతో నన్ను నేనే పెళ్లాడతానంటూ సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.
తనను తనకంటే ఎక్కువగా ఎవరూ ప్రేమించరని బాహియాలోని ఇటాకేర్ పట్టణంలో ఓ రిసార్ట్‌లో తనను తానే పెళ్లి చేసుకోగా 40 మంది అతిథులు హాజరయ్యారు. డియాగో పెళ్లి అనంతరం తాను సాధించాను అని పోస్ట్ చేశాడు.